ఒక్క అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా….

  • ఒక్క అవకాశం ఇవ్వండి… అభివృద్ధి చేసి చూపిస్తా… ధీమా వ్యక్తం చేసిన స్వత్రంత్ర అభ్యర్థి(బీరువా గుర్తు కి )మహీంద్ర
  • కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం.. మహీంద్రకు మద్దతుగా విజ్ఞప్తి

 

బొమ్మనహాల్, నవంబరు1

YES 9 టీవీ న్యూస్,

 

మండల స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి మహీంద్ర (బీరువా గుర్తు) తన కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మండల పరిధిలోని గోవిందవాడ, కళ్ళుహొల గ్రామాల్లో కుటుంబ సభ్యులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ నేరుగా ఓటర్లను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తమ కుటుంబ పెద్ద అయిన జడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి మహీంద్రకు బెరువా గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మహీంద్రను గెలిపిస్తే బొమ్మనహాల్ మండలంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. తమకు ఒక్క అవకాశం కల్పిస్తే అభివృద్ధి అంటే ఏమిటో ఆచరణలో చూపిస్తామని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అనంతరం కళ్ళుహొల గ్రామంలోని దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా దర్గాలో దర్శనం చేసుకుని గ్రామ ప్రజలతో మమేకమయ్యారు. కుటుంబ సభ్యులంతా కలిసి నిర్వహించిన ఈ ప్రచారానికి గ్రామ ప్రజల నుంచి స్పందన లభించింది.

Posted Under AP
Editor