Latest Posts

తాగునీటి కష్టాలపై తిరగబడ్డ ముదిగుబ్బ గ్రామస్తులు: ఎంపీడీవో ఆఫీస్‌కు తాళం వేసి, ఖాళీ బిందెలతో భారీ నిరసన!

ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండలం లో ఎంపీడీవో కార్యాలయనికి తాళం వేసి ఖాళీ బిందెలు తో నిరసన…
ముదిగుబ్బ గ్రామం పాత ఊరిలో గత నెల రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో విసుగు చెందిన గ్రామస్తులు ‌‌‌ గత్యంతరం లేక ‌ మంగళవారం ముదిగుబ్బ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు చేత పెట్టి నిరసన వ్యక్తం చేశారు, అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి
ఆ కార్యాలయానికి తాళాలు వేసి అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంపై‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు…
కొన్ని నెలలుగా ‌తాగునిరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు…
వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు కావున ఇప్పటికైనా ‌ తక్షణమే నీటి సరఫరా చేయకపోతే‌‌ ప్రతిరోజు ఇక్కడే నిరవధిక దీక్ష చేపట్టి తద్వారా ప్రతి ఆఫీసును ముట్టడిస్తామని ఈ సందర్భంగా స్థానిక పాత ఊరు మహిళల నిరసనకు మద్దతు పలికిన సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు అధికారులకు తెలియజేశారు…
అదే సమయంలో ఎంపీడీవో కార్యాలయానికి వచ్చిన ఎంపీపీ ఆదినారాయణ యాదవను కూడా కార్యాలయంలోకి వెళ్లకుండా పాతూరు గ్రామస్తులు అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆయనపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో స్పందించిన ఎంపీపీ తక్షణమే మీకు ఈ రోజే నా సొంత ఖర్చులతో బోరు వేయించి తాగునీటి సౌకర్యం కల్పిస్తానని హామీ ఇవ్వడంతో నిరసనకారులు తమ ఆందోళన విరమించారు, కాగా ముదిగుబ్బ పాత ఊరు గ్రామస్తులు నిర్వహించిన ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ నాయకులు ‌చల్లా శ్రీనివాసులు, వైసీపీ నాయకులు ముల్లగూరు ఆనందుతో పాటు టిడిపి పార్టీ సానుభూతిపరులు అన్నమనేని దామోదర్ నాయుడు, చల్లా శంకర్ నాయుడు, తుమ్మల శ్రీనివాసులు , తుమ్మల మధు, హరి కుమార్ తదితరులు తమ మద్దతు తెలిపారు…

Posted Under AP
Editor