బత్తలపల్లి yes9tv 12 ఏళ్లుగా వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ
సీఎం సహాయ నిధి ద్వారా రూ.2.50 లక్షల వైద్య సహాయం మంజూరు
బత్తలపల్లి, మే 19: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలం అప్పరాచెరువు గ్రామానికి చెందిన ఎం. తరుణ్ కుమార్ రెడ్డి గత 12 సంవత్సరాలుగా క్రానిక్ మైలోయిడ్ లుకేమియా (CML) వ్యాధితో బాధపడుతున్న విషయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ దృష్టికి వచ్చినట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.
తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు మంత్రిని కలిసి తమ కుటుంబ ఆర్థిక పరిస్థితిని, దీర్ఘకాలిక వైద్య చికిత్స వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించినట్లు తెలిపింది. వారి వినతిపై మంత్రి సత్యకుమార్ యాదవ్ వెంటనే స్పందించి, బాధితుడికి అవసరమైన వైద్య సహాయం అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు పేర్కొంది.
ఈ మేరకు మంత్రి ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాయగా, ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) పరిధిలో లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) ద్వారా నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స కోసం రూ.2,50,000 ఆర్థిక సహాయం మంజూరైనట్లు మంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ కావడంతో బాధిత కుటుంబానికి పెద్ద ఊరట లభించినట్లు తెలిపింది. ప్రజల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ నిరంతరం ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, అవసరమైన వారికి సీఎం సహాయ నిధి మరియు ఎల్ఓసీల ద్వారా వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కార్యాలయం పేర్కొంది.
కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్న మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు తరుణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యాధితో పోరాడుతున్న యువకుడికి మంత్రి సత్యకుమార్ యాదవ్ అండ: సీఎం సహాయ నిధి నుండి రూ.2.50 లక్షల వైద్య సాయం మంజూరు!
