అనంతపురం జిల్లా, రాయదుర్గం.
*నీట్ పరీక్షా లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి*
*విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం*
*ఎన్ టి ఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి*
*భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ*
*ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ*
*రాయదుర్గం:
దేశవ్యాప్తంగా మే 3వ తేదీన జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్షలలో 20 లక్షలకు పైగా రాశారు ఈరోజు పేపర్ లీకేజ్ జరిగిందని పరీక్షను రద్దు చేయడం జరిగింది. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు పైగా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యను పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష ప్రిపేర్ అయ్యి పరీక్ష రాస్తే ఇప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని నీట్ పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు.. నీట్ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు అప్లై చేసుకుని చాలా రోజుల నుంచి ప్రిపేర్ అయ్యి వివిధ జిల్లాల నుంచి వివిధ జిల్లాలకు పోయి పరీక్ష రాస్తే ఈరోజు పేపర్ లీకేజ్ అయిందని రద్దు చేశారు విద్యార్థుల సమయాన్ని కేంద్ర ప్రభుత్వం వృధా చేయడమే కాకుండా వాళ్ళ ఆశలను పోయే విధంగా చేసిందని మండిపడ్డారు. గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హర్యానా బీహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పేపర్ను 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు అమ్ముకొని లీకేజ్ చేశారని గుర్తు చేశారు మరి ఈ సంవత్సరం కూడా అదే తరహాలోనే డబ్బులకు నీట్ పేపర్ను అమ్ముతున్నారని మండిపడ్డారు చాలామంది విద్యార్థులు బాగా చదువుకొని నీట్ ప్రవేశ పరీక్షలో సీటు కొట్టాలన్న ఆశతో పరీక్ష రాస్తే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేపర్ ను లీకేజ్ చేయడం జరిగిందన్నారు దానివల్ల విద్యార్థుల జీవితాలు తీవ్రంగా నష్టపోతాయని కేంద్ర ప్రభుత్వం పైన మండిపడ్డారు ఎన్ టి ఏ ఏజెన్సీ ద్వారా నీట్ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తా ఉంది ఈ కొన్ని సంవత్సరాలలోనే రెండుసార్లు లీకేజ్ కావడం కేంద్ర ప్రభుత్వం నీట్ ప్రవేశ పరీక్ష పైన ఎంత శ్రద్ధ చూపిస్తా ఉందొ అర్థం చేసుకోవాలన్నారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ ఘటన పైన ఇది రెండవసారి జరగడం దీనికి నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో నీటి ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేవారని గుర్తు చేశారు ఆ సందర్భంలో ఎప్పుడూ కూడా నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పేపరు లీకేజ్ జరిగింది లేదన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నీ ప్రవేశ పరీక్షను డబ్బులకు అమ్ముకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేంద్ర విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇలా రెండు సంవత్సరాల లో పేపర్ లీకేజ్ కావడం జరిగిందని తెలిపారు తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్ టి ఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
