కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం: పాల్గొన్న గుమ్మనూరు నారాయణస్వామి

కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈరోజు గుంతకల్ మండల ఇన్చార్జ్ గుమ్మనూరు నారాయణస్వామి గారు పాదయాత్రగా శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ అభివృద్ధిలో భాగంగా దాతలతో కలిసి దేవాలయ ప్రధాన గర్భగుడి ద్వారాన్ని స్థాపించారు.

అలాగే దేవాలయ పరిపాలనా కార్యాలయం, ప్రసాద్ విక్రయ కేంద్రం మరియు నూతన షాపింగ్ కాంప్లెక్స్‌ను ప్రారంభించి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా చర్యలు చేపట్టారు. దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు మరియు గ్రామ ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

Posted Under AP
Editor