Latest Posts

అరటి తోటకు నిప్పు – రైతుకు భారీ నష్టం

తాడిమర్రి మండలంలో అరటి తోటకు నిప్పు – రైతుకు భారీ నష్టం
తాడిమర్రి, మే 11:
తాడిమర్రి మండలంలోని తోట గ్రామంలో ఆదివారం సాయంత్రం దుండగుల దుశ్చర్యతో అరటి తోట దగ్ధమైన ఘటన చోటుచేసుకుంది. దాడితోట గ్రామానికి చెందిన రైతు శశిభూషణ్ రెడ్డి రెండు ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాడు.
అయితే ఆదివారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు తోటలో నిప్పు పెట్టడంతో సుమారు 100 అరటి చెట్లు పూర్తిగా కాలిపోయాయి. అలాగే డ్రిప్ సాగు పరికరాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనతో రైతుకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లింది.
ఈ ఘటనపై బాధితుడు శశిభూషణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలి

Posted Under AP
Editor