ముదిగుబ్బ యస్ 9
మే నెలలో సాధారణంగా స్కూల్ కు సెలవులుంటాయి.
ఈ సెలవులలో స్కూలు బస్సులను రిపేర్ చేసుకోవడం వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ను పొందడం అనేది ఆనవాయితీ.
చాలామంది స్కూలు యాజమాన్యం వారు ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తా ఉంటారు.
అలా నిర్లక్ష్యం వహించిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడునని రవాణా శాఖ వారిచే విజ్ఞప్తి.
అలాగే ఈరోజు సుమారు 16 స్కూలు బస్సులను తనిఖీ చేసి వాటికి ఫిట్నెస్ లేని వాటిని గుర్తించడము వాటిని మే 15వ తారీకు లోపల రిపేరీలు చేసుకుని ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందవలసిందిగా తెలియజేయడమైనది. అలాగే కదిరి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ ఈరోజు ముదిగుబ్బలోని అన్ని స్కూలు బస్సులు తనిఖీ చేయడమైనది.
వాటిలో ఆరు బస్సులకు నోటీసు జారీ చేయడమైనది ఆ నోటీసు జారీ చేసిన వారు వారి బస్సులను సరిచేసుకొని వాహనాన్ని కండిషన్లో పెట్టుకుని ఫిట్నెస్ పొందవలసిందిగా తెలియజేయడమైనది.
స్కూలు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాల నివారించాలని ఆర్టీవో శ్రీనివాసులు తెలియజేశారు.
