ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధo..

హిందూపురం:
హిందూపురం మండల పరిధిలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో 15 ఎంపీటీసీ స్థానాలు, ఒక జెడ్పీటీసీ స్థానం పోలింగ్ నివారణకు సర్వం సిద్ధం చేశారు. ఉన్నాయి. హిందూపురం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు మొత్తం 43,155 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 52 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ప్రిసైడింగ్ అధికారి (పీవో), ఒక సహాయ ప్రిసైడింగ్ అధికారి (ఏపీవో) చొప్పున మొత్తం 52 మంది పీవోలు, 52 మంది ఏపీవోలను నియమించారు. అలాగే సుమారు 230 మంది ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవోలు) ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల ఏమైనా కోసం కూలింగ్ అధికారులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం నుంచి పోలింగ్ సామాగ్రి ని సిద్ధం చేసుకుని ఆయా పంచాయతీలకు తరలి వెళ్లారు.

Posted Under AP
Editor