తాడిమర్రి (yes9tv )నాయనపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
తాడిమర్రి మండలంలోని నాయనపల్లి గ్రామంలో ఈరోజు శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడంతో భక్తులు, గ్రామస్తులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.
గ్రామ ప్రజలు, నాయకులు మరియు కొందరు దాతల సహకారంతో ఈ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడిపి నాయకుడు, డీలర్ తొట్టి గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించడం విశేషం.
గంగాధర్ ఆహ్వానం మేరకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు తమ వంతు విరాళాలను సమర్పించి భక్తి భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పడంతో పాటు గ్రామస్తుల్లో ఐక్యతను మరింత బలపరిచింది.
అంగరంగ వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట
