రాయదుర్గంలో నీటి సమస్య…

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

రాయదుర్గంలో నీటి సమస్య

రాయదుర్గం పట్టణంలో తాగునీటి సరఫరా జఠినమైంది. దాదాపు 8 రోజులు కావస్తున్న నీటి సరఫరా అందకపోవడంతో సీనియర్ సిటిజన్, విశ్రాంత ఉద్యోగ బ్రాహ్మణులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని 25వ వార్డు కోట ఏరియా కు చెందిన బ్రాహ్మణులు మరియు ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు రాయదుర్గం పట్టణానికి తల మాణికమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే నీటి సరఫరా అంధక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. తమ ఇంటికి పిలిపించిన బంధువులకు సైతం నీటిని అందించలేకపోతున్నామని పేర్కొన్నారు. అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నీటి కొరత లేదని అధికారులు చెబుతున్నప్పటికీ సరఫరాలో మాత్రం తీవ్ర జాప్యం వహిస్తున్నారన్నారు. కనీసం మూడు రోజులకోసారైనా నీటిని విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటి సమస్యను పరిష్కరించకపోతే రోడ్లెక్కి నిరసన తెలపాల్సి ఉంటుందని అధికారులను హెచ్చరించారు. కనీసం నీటి ట్యాంకర్లను సైతం పంపించలేని దుస్థితిలో మున్సిపల్ అధికారులు ఉండడం ఏంటంటు కాలనీవాసులు ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని వారికి సర్ది చెప్పి నీటి సరఫరాను తక్షణమే అందించేలా చూశారు.

Posted Under AP
Editor