తమ ఐదు నెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని గత మూడు రోజులుగా సత్యసాయి కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా గురువారం వారు సిపిఐ, సిపిఎం, సీఐటీయూ పార్టీల ఆధ్వర్యంలో మండల కేంద్రమైన ముదిగుబ్బలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ఈ మేరకు వారు పట్టణ నడిబొడ్డున జాతీయ రహదారిపై కదిరి రోడ్డు లో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి సొసైటీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు, అనంతరం అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం సమర్పించి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు, అదేవిధంగా నిరవధిక దీక్ష కొనసాగింపులో భాగంగా సొసైటీ సర్కిల్లో శిబిరాన్ని ఏర్పాటు చేసి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ మేరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర నాయకులు ఓబుల కొండారెడ్డి, నరసింహులు, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు, సిపిఎం మండల నాయకులు పెద్దన్న, సిఐటియు మండల నాయకులు బాబ్జాన్ తో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి కార్మిక సంఘాలకు చెందిన పలువురు నాయకులు మాట్లాడుతూ సత్యసాయి కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అనుచేస్తున్న నిర్లక్ష్య వైఖరి పై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు, సత్యసాయి నీటి పథకం నిర్వహణను బోర్డు నుంచి తప్పించి జిల్లా పరిషత్ లోకి విలీనం చేయాలన్న ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని తక్షణమే మానుకోవాలని కోరారు, వెంటనే తమ పెండింగ్ జీతాలను చెల్లించడంతోపాటు మిగిలిన డిమాండ్లను కూడా తక్షణమే పరిష్కరించకపోతే తమ నిరవధిక దీక్ష కార్యక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున కొనసాగిస్తామని హెచ్చరించారు , ఈ కార్యక్రమంలో సత్య సాయి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జీతాలు చెల్లించాలని .కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలని నినాదాలు చేశారు,
5 నెలల పెండింగ్ జీతాలు చెల్లించాల్సిందే: ముదిగుబ్బలో సత్యసాయి కార్మికుల భారీ ర్యాలీ
