తాడిమర్రి మండలంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం – కూలీలకు ORS పంపిణీ

తాడిమర్రి (yes9tv )తాడిమర్రి మండలంలో వడదెబ్బపై అవగాహన కార్యక్రమం – కూలీలకు ORS పంపిణీ
ఈ రోజు తాడిమర్రి మండలం పరిధిలోని దాడితోట, మద్దెలచెరువు గ్రామాలలో వడదెబ్బ నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు ORS ప్యాకెట్లను పంపిణీ చేశారు. శరీరంలో నీరసం, డీహైడ్రేషన్ రాకుండా ఉండేందుకు ORS వినియోగం ఎంత ముఖ్యమో వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకట రంగారావు, ఏపీవో అనిల్ కుమార్ రెడ్డి, హెల్త్ స్టాఫ్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ప్రజలు ఎండ సమయంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Posted Under AP
Editor