70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి..

70 రూ. అప్పు కోసం కిరాణా వ్యాపారిపై కత్తితో దాడి
ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఓ కిరాణా దుకాణ వ్యాపారి కి తనకు రావలసిన అంగడి బాకీ 70 రూపాయలు ఇమ్మని అడిగినందుకు కిరాణా వ్యాపారి మణికంఠ పై వసంత అనే మరో యువకుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన బుధవారం మండల కేంద్రమైన ముదిగుబ్బలో స్థానిక గేటు కొట్టాల ప్రాంతంలో జరిగినట్లు పోలీసుల ద్వారా తెలిసింది, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు గేట్ కొట్టాలలోని సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి గాయపడిన మణికంఠను చికిత్స నిమిత్తం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అనంతరం పోలీసులు బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న వసంత కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం,

Posted Under AP
Editor