ముదిగుబ్బ యస్ 9
ముదిగుబ్బ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినట్లు ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ గారు తెలిపారు.వివరాల ప్రకారం, పి. ఓబులేసు (36 సంవత్సరాలు), తండ్రి పెద్ద గంగన్న, ఆర్ & బి బంగ్లా, ముదిగుబ్బ గ్రామం మరియు మండలం నివాసి, అలాగే కే. రవికుమార్ (30 సంవత్సరాలు), తండ్రి చిన్న పకీరప్ప, నాగలగుబ్బల గ్రామం, ముదిగుబ్బ మండలం నివాసి, మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న సమయంలో ముదిగుబ్బ పోలీస్ వారు అదుపులోకి తీసుకున్నారు.వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ యంత్రం ద్వారా పరీక్షించగా మద్యం సేవించినట్లు నిర్ధారణ అయింది. అనంతరం వారిని రాజశ్రీ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సెకండ్ క్లాస్, కదిరి వారి ఎదుట హాజరు పరచగా, మెజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి రూ. 10,000/- చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు.ముదిగుబ్బ ఇన్స్పెక్టర్ గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఇది ప్రాణాలకు ముప్పు కలిగించే చర్య అని హెచ్చరించారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ముదిగుబ్బలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి ₹20,000 భారీ జరిమానా
