మంత్రి కార్యాలయం చొరవతో తాడిమర్రి ఆత్మకూరు SC కాలనీలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..

తాడిమర్రి (yes9tv)
తాడిమర్రి, మే 06: ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి మండలం ఆత్మకూరు గ్రామంలోని SC కాలనీలో నెలకొన్న తీవ్ర త్రాగునీటి సమస్యకు మంత్రి కార్యాలయం చొరవతో శాశ్వత పరిష్కారం లభించింది. కాలనీ ప్రజలు ఇటీవల మంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించగా, వారి విన్నపాన్ని స్వీకరించిన సిబ్బంది వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో కాలనీలో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేసి, అవసరమైన చోట్ల కొత్త కుళాయిలను అమర్చి త్రాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కొంతకాలంగా నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గణనీయమైన ఉపశమనం లభించింది.
సమస్యను ఆలస్యం చేయకుండా త్వరితగతిన పరిష్కరించిన మంత్రి కార్యాలయంపై కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి మరియు వారి కార్యాలయ సిబ్బందికి ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి స్థిరమైన పరిష్కారం చూపడం అభినందనీయమని పేర్కొన్నారు.

Posted Under AP
Editor