సత్యసాయి జిల్లా, ధర్మవరం..
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో దొంగలు తెల్లవారుజాము చోరీకి తెగబడ్డారు. పార్థసారథి నగర్ ప్రధాన రహదారి పక్కన ఉన్న ఐడీఎఫ్సీ బ్యాంకు ఏటీఎంను దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు మాస్కులు ధరించి ఏటీఎంలోకి ప్రవేశించారు. మొదట రాడ్లతో ఏటీఎంను తొలగించే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాకపోవడంతో తాళ్లు కట్టి బొలెరో వాహనంతో బలంగా లాగి ఏటీఎంను బయటకు తీశారు. అనంతరం దానిని వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
