ముదిగుబ్బ యస్ 9
శ్రీ సత్యసాయి బాబా నీటి పథకము కార్మికుల సమ్మె రెండవరోజు…మద్దతు తెలిపిన సీఐటీయూ నాయకులు
ముదిగుబ్బ మండలం లో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బంది ఉంటుందని, ఇది చాల తీవ్రమైనది అని మాకు తెలుసు. అయితే మేము డిమాండ్ల కోసము సమ్మె చేయలేదని, మా వేతనములతో పాటు శ్రీ సత్యసాయి బాబా వారి నీటి పథకము పరిరక్షణకై పనిచేయుచున్నామని సవినయంగా తెలియచేయుచున్నాము.
శ్రీ సత్యసాయి బాబా రక్షిత మంచి నీటి పథకము గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. మేము సమ్మె చేస్తే ప్రజల ఇబ్బందులు అని మాత్రమే అధికారులు, ప్రజా ప్రతినిధులు గుర్తిస్తున్నారు. 1997 నుండి 2019 వరకు సక్రమంగా నడిచింది. 2019 నుండి ఈ నీటి పథకమునకు అవసరమైన బడ్జెట్ కేటాయించకుండా రాష్ట్ర స్థాయి అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. సమ్మె చేస్తేనే బడ్జెట్ గురించి నీటి పథకము గురించి అలోచించే అనవాయితీ ఎర్పడింది. గత సంవత్సరము (2025 -26) నకు బాబా గారి పథకము నిర్వహణకు 35 కోట్ల రుపాయలు అవసరమైతే కేవలము 13.7 కోట్ల రుపాయలు కేటాయించారు. అందువల్ల 5 నెలలు వేతనములు బకాయిలు ఉన్నాయి. మొత్తంగా 20 కోట్ల రుపాయల లోటు ఉన్నది. 2026-27 సంవత్సరమునకు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ ఒక్క రుపాయి కూడ కేటాయించలేదంటే శ్రీ సత్యసాయి బాబా నీటి పథకమును నడిపే ఉద్దేశ్యము ప్రభుత్వమునకు లేదా? అనే సందేహం వస్తున్నది. శాసనసభ్యులు, మంత్రుల దృష్టికి తీసికెళ్ళాము వారు సానుకూలంగా స్పందించినప్పటికినీ ఫలితము రాలేదు.
కనుక మేము మా వేతనముల ఇబ్బందితో పాటు, నీటి పథకము బాబా గారి ఆశయం మేరకు నడవడానికి కూడ ఇబ్బంది ఉన్నది. ప్రజలకు నీటి కష్టాలు కల్పిస్తున్నది, కార్మికులుగా మేము కాదని, రాష్ట్ర స్థాయి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం అని తెలియచేస్తున్నాము. నీరు ప్రజలకు అందాలి అంటే కార్మికులము తమ స్వంత ఖర్చులతోనే పని ప్రదేశమునకు, మరియు పైప్ లైన్ల వెంబడి వెళ్ళవలసి ఉన్నది.
పథకము నిర్వహణలో బాగంగా దినసరి యంత్ర సామాగ్రి ఖర్చుకు, రవాణ ఖర్చులకు, క్లోరిన్, బ్లీచింగ్ పౌడర్, పంప్లకు అవసరమయ్యే అయిల్స్, గ్రీజ్లు, జాయింట్లు బోల్ట్ అండ్ నట్స్ లాంటి అనేక కన్జూమబుల్ మెటిరియల్ లకు, రిపేర్ల ఖర్చులకు ఖర్చు చేసే వారే లేని పరిస్థితి.పై అంశములను పరిశీలించి సమ్మె న్యాయమైనదని, అవసరమైనది అని ప్రజలు గుర్తించాలనీ తెలియచేసుకుంటున్నాము.
శ్రీ సత్యసాయి నీటి పథకం కార్మికుల సమ్మె: రెండో రోజుకు చేరిన నిరసన – మద్దతుగా సీఐటీయూ
