Latest Posts

*పెన్నహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..

*పెన్నహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు..

*అనంతరం మడుగుతేరు (రథోత్సవం)లో పాల్గొన్న మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

*మంత్రితో పాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, తదితరులు..

– *ఉరవకొండ మండలం పెన్నహోబిళం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి చేరుకున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకి ఆలయ ఈఓ, అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి ఆలయ ఆర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా స్వామివారి పలికి సేవలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆశేష జన సందోహం మధ్య మడుగుతేరు (రథోత్సవం)లో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor