అనంతపురం జిల్లా, ఉరవకొండ మండలం పరిధిలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సూర్యప్రభ వాహనోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆలంకారికంగా విరాజిల్లుతూ మాడ వీధులు చుట్టూ తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
ఈ సూర్యప్రభ వాహనోత్సవం సూర్యుని తేజస్సు, ధర్మప్రకాశాన్ని సూచిస్తుంది.
ఈ కార్యక్రమంలో ఉభయ దారులు యం.నారాయణ స్వామి మరియు వారి కుమారులు, అంబేద్కర్ నగర్, అనంతపురము, ధర్మ కర్తల మండలి సభ్యులు,దేవస్థాన అర్చకులు, పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు. భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాము.
పెన్నహోబిలం క్షేత్రంలో వైభవంగా సూర్యప్రభ వాహనోత్సవం: ఉత్సవ మూర్తిగా భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహస్వామి
