ముదిగుబ్బ…యస్ 9
ముదిగుబ్బ మండల కేంద్రంలో ఆర్‌డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంతలక్ష్మి మహిళా సహాయక సహకార పొదుపు మరియు పరపతి సంఘం లిమిటెడ్ సమావేశం ముదిగుబ్బ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వెయ్యి మంది మహిళల తో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విశాల ఫెర్రర్ హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళలకు చల్లని నీటిని అందిస్తూ విశాలాంధ్ర ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ డాక్టర్ ఎస్. జయనందన్ రెడ్డి సేవాభావాన్ని చాటుకున్నారు.
సమావేశానికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు దాహం తీర్చేందుకు ఆయన ఆధ్వర్యంలో 50 వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని పంపిణీ చేశారు. వేసవి తీవ్రత మధ్య ఈ చర్య మహిళలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించింది.
ఈ సందర్భంగా ఆర్‌డీటీ సంస్థ ప్రతినిధులు, ఆర్డిటి ఎటిఎం కిష్టప్ప, మరియు మహిళలు ప్రజలు జయనందన్ రెడ్డి సేవలను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సమాజ సేవలో ముందుండే వ్యక్తిగా ఆయన మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు.
మహిళల సమావేశానికి చల్లని నీటి వితరణ చేసిన ఉమ్మడి జిల్లాల విశాలాంధ్ర బ్యూరో చీఫ్ డాక్టర్ ఎస్.జయ నందన్ రెడ్డి
