మనం దినపత్రిక జర్నలిస్టు లక్ష్మీనారాయణ పై దాడిని ఖండిస్తూ ఈ దాడికి పాల్పడిన గీతం కాలేజీ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకుని మనం పత్రిక విలేకరి లక్ష్మీనారాయణ కు రక్షణ కల్పించవలసిందిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిందనూరు నాగరాజు. రాష్ట్ర కార్యదర్శి గద్దల నాగభూషణం జిల్లా అధ్యక్షులు కాసాని నాగరాజ్ డిమాండ్ చేయడం జరిగింది.
సమాజంలోని అసమానతలను నిత్యం వెలుగులోకి తెస్తున్న విలేకరులకు రక్షణ లేకపోతే ఎలా?రక్షణ చట్టం కావాలని. మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి విలేకరి దారుణ హత్య. ఈరోజు మనం విలేకరి పై దాడికి పాల్పడిన గీతం కాలేజీ యాజమాన్యం, నిజానిజాలు వెలికితీస్తున్న విలేకరులపై నిత్యం ఇలాంటి దాడులు జరిగితే సమాజం ఎక్కడికి వెళుతుందో ఒక్కసారి ప్రజలు అధికారులు ఆలోచన చేయాలి. విలేకరులు రాసిన రాతలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే లీగల్ గా గాని, లేదా పోలీసు వారికి కంప్లైంట్ చేయాలే కానీ స్వయంగా యాజమాన్యమే రౌడీలతో రంగంలోకి దిగి స్వయంగా విలేకరి ఇంటికే వెళ్లి తన పైన తన భార్య పిల్లలపై కూడా చేయి చేసుకోవడం చాలా దారుణమని. చిన్నపిల్లవాడు అనేది లేకున్నట్టు లాగి పారేయడం. ఎంత దుర్మార్గమైన చర్య.బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు చలో ఆకువీడు కార్యక్రమంలో ఉండడంవల్ల సోమవారం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు దీనిపై కార్యాచరణ చేపడతామని తెలియజేయడం జరిగింది.
