పెన్నహోబిలంలో వైభవంగా హంస వాహన సేవ: భక్తుల మధ్య కొలువుదీరిన లక్ష్మీ నరసింహ స్వామి…

పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు 02-05-2026 న సాయంత్రం భక్తిశ్రద్ధల మధ్య హంస వాహన సేవ ఘనంగా నిర్వహించబడింది. ఆలయ మాడ వీధులు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు హంస వాహనంపై అద్భుతంగా అలంకరించబడినది.
హంస వాహనం జ్ఞానం, పవిత్రతకు ప్రతీకగా భావించబడుతుంది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ హంస వాహన సేవను దర్శించేందుకు పరిసర గ్రామాల భక్తులు తరలివచ్చారు. మొత్తం కార్యక్రమం భక్తి, శ్రద్ధ, వైభవంతో విజయవంతంగా ముగిసినది. ఈ కార్యక్రమంలో ఉభయ దారులు శ్రీ వేలూరు నారమ్మ గారి మనవడు రంగయ్య, అమిద్యాల వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.దేవస్థానము అర్చకులు, సిబ్బంది, పోలిష్ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor