Latest Posts

రైతుల సమస్యలపై స్పందన – రీసర్వే లోపాల సవరణకు వినతి

తాడిమర్రి( yes9tv)రైతుల సమస్యలపై స్పందన – రీసర్వే లోపాల సవరణకు వినతి
గౌరవ కేతిరెడ్డి గారి ఆదేశాల మేరకు, వైఎస్ఆర్సిపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారి అధ్యక్షతన (02-05-2026) తాడిమర్రి మండల కేంద్రంలో రైతుల సమస్యలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రీసర్వే ప్రక్రియలో జరిగిన పొరపాట్లను సరిచేసి రైతులకు న్యాయం చేయాలని ఎమ్మార్వో (MRO) గారికి వినతి భాస్కర్ రెడ్డి కి పత్రం అందజేశారు. అనంతరం ఎంపీడీవో (MPDO) రంగారావు కార్యాలయంలో ప్రజా సమస్యలపై చర్చించి, ఎంపీడీవో గారి దృష్టికి వివిధ సమస్యలను తీసుకెళ్లారు.
ఈ కార్యక్రమంలో తాడిమర్రి చంద్రశేఖర్ రెడ్డి గారు, కునుకుంట్ల గోపాల్ రెడ్డి గారు, రామాపురం మాజీ సర్పంచ్ కుంటాల పుల్లయ్య, తాడిమర్రి మండల కన్వీనర్ రామాంజనేయులు గారు,అరవేటి పెద్దిరాజు వైఎస్ఆర్సిపి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మండల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor