ముదిగుబ్బ మండలంలో ఖరీఫ్ సీజన్ పంట రుణాల రెన్యువల్ విషయమై ఫ్రీ హోల్డ్ భూముల రైతులు
రీ సర్వే కాబడిన భూముల రైతులు క్రాప్ లోన్ రెన్యువల్ పరంగా బ్యాంకుల్లో ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సాధనకై ఈనెల 6వ తేదీ ముదిగుబ్బ కెనరా బ్యాంకు వద్ద సిపిఐ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని
ఆపార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు, ఈ మేరకు సిపిఐ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించిన వివరాలు తమ బ్యాంకు వెబ్ లాండ్ ల్యాండ్ లో కనిపించ లేదనే కారణంతో బ్యాంక్ అధికారులు ముఖ్యంగా కెనరా బ్యాంకు వారు ఆయా భూముల రైతులకు ఎన్ని ఎకరాలు ఉన్న రెండు లక్షలకు మించి రుణం మంజూరు చేయకపోవడమే గాక ఇప్పటికే గతంలో ఈ భూముల పైన రెండు లక్షల మించి రుణము తీసుకొని ఉంటే ఆ డబ్బులను తిరిగి బ్యాంకుకు చెల్లించాలని నిబంధనలు పెడుతున్నారని ఆరోపించారు, ఈ పరిస్థితిలో చాలామంది రైతన్నలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల నడుమ రెండు లక్షల పైన తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేక తద్వారా సకాలంలో తమ పంట రుణాన్ని రెన్యువల్ చేసుకోలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారని సిపిఐ నాయకులు శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు , దీంతో ఫ్రీ హోల్డ్ భూముల మరియు
రి సర్వే అయిన భూముల రైతులు తమ పంట రుణాల రెన్యువల్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సంబంధిత బ్యాంకుల ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆయన ఆవేదన చెందారు, కనుక బ్యాంకుల్లో క్రాప్ లోన్ రెన్యువల్ విషయమై రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సాధనకై ముదిగుబ్బ పట్టణంలో కెనరా బ్యాంకు వద్ద ఆరవ తేదీ నిర్వహించి తలపెట్టిన ఈ ధర్నాకు మండలంలోని రైతన్నలు సీపీఐ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు పిలుపునిచ్చారు,
ముదిగుబ్బలో రైతులకు పంట రుణాల కష్టాలు: ఈనెల 6న కెనరా బ్యాంక్ వద్ద సిపిఐ భారీ ధర్నా
