Latest Posts

మహిళా భద్రతపై నల్లమాడ పోలీసుల అవగాహన ర్యాలీ: ఆపదలో అత్యవసర నంబర్లను ఆశ్రయించాలని ఎస్సై సూచన

మహిళలు చట్టాలపై అవగాహన శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల కేంద్రంలో ఈరోజు చట్టాలపై అవగాహన కల్పించేందుకు నల్లమాడ పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు. తమపై జరిగే నేరాల నుండి జాగ్రత్త పడతారని నల్లవాడ ఎస్సై సతీష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం నల్లమాడలో మహిళా భద్రతపై మీ భద్రతా మా బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళా చట్టాలు మహిళలు చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాలపై ఎస్సై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి మహిళ అత్యవసర నంబర్లైన 100, 112, 1930 గుర్తుపెట్టుకుని ఆపద సమయంలో కాల్ చేయాలని ఆయన సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ కూడాల వరకు మహిళా భద్రత పై నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ సత్యనారాయణ తెదేపా మండల కన్వీనర్ మైలే శంకర్, సోమల నాయక్, బుట్టి నాగభూషణం నాయుడు, మహిళలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor