Latest Posts

ధర్మవరం కేశవనగర్‌లో ఘనంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…

ధర్మవరం(yes9tv)
లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – హరీష్ బాబు
ధర్మవరం, మే 01: ధర్మవరం పట్టణంలోని 7వ వార్డు కేశవనగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. వృద్ధులు, విధవులు, వికలాంగులు తదితర లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి ముఖాల్లో ఆనందం నింపారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి మరియు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు.
ఈ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తూ, తమకు అందుతున్న సహాయంపై కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, నాయకులు పామిశెట్టి శివ శంకర్, వేల్పుల తులసి దాస్, జుటూర్ వెంకటేష్, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor