- ఆర్థికమంత్రి గారు అవాక్కులు చాలించండి,
- ప్రజా సమస్యలను పక్కదావ పట్టించేందుకు “గత ప్రభుత్వ పాలన విధ్వంసం” అంటూ ఇంకా ఎన్నేళ్ళు కాలం గడుపుతారు?
- వ్యవసాయమేలేని సింగపూర్ లో వ్యవసాయ శాఖా మంత్రి ఏమి శిక్షణ పొందుతారో?
- చేసిన అప్పులపై నిజాలు మాట్లాడండి.,
- గత ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని రాష్ట్రములో ఏ పేదవాన్ని అడిగినా చెబుతారు
- ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి, మంత్రిగా పదవీకాలం పూర్తీగా కొనసాగించడానికి ఉన్నవి లేనివిగా ఆపాదించకండి ఆర్థిక మంత్రిగారు
- నిన్నటి ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై యం.యల్.సి. వై. శివరామ రెడ్డి ధ్వజం.
(ఉరవకొండ – 01.05.2026)
రాష్ట్రములో పేదవాడికి అందాల్సిన సంక్షేమం మాత్రం గాలికి వదిలేసి ఎవరైనా సంక్షేమ పథకాల గురించి ప్రశ్నిస్తారేమో అనే నెపముతో “ గత ప్రభుత్వములో విధ్వంసం జరిగింది” దాన్ని సర్డుతున్నమంటూ కల్లిబొల్లి కబుర్లు చెప్పడం తప్ప ప్రజా సమస్యలు తీర్చడములో చిత్తశుద్ధి ఏమైందని యం.యల్.సి. వై. శివరామ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థికమంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ, విధ్వంసం కోసం జగన్ గారు అల్ఖయిదా దగ్గరకు పంపేవారని చేసిన ప్రకటనమై యం.యల్.సి. వై. శివరామ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం తెలుపుతూ శుక్రవారం నాడు పత్రికా ప్రకటన విడుదల చేసారు.
గత ప్రభుత్వములో జరిగిన విధ్వంసం ఏమిటో మంత్రిగారు గుర్తుచేస్తా అంటూ వ్యంగంగా ఆయన వర్నిస్తూ
Ø 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు స్ధాపించి 1.35 లక్షల మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం విధ్వంసమా?
Ø సామాన్య మానవుని ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 10,032 విలేజ్ క్లినిక్ లు ప్రతి గ్రామంలో పెట్టడం విధ్వంసమా?
Ø 10,778 రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులందరికీ మందులు, ఎరువులు, ధాన్యం సేకరణ చేయడం విధ్వంసమా?
Ø ప్రభుత్వపాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేటు స్కూళ్లు కంటే మెరుగ్గా బాగుచేసి అందుకోసం తొలిదశలో రూ.3,700 కోట్లు ఖర్చు చేసి రెండో దశలో 22,344 స్కూళ్లు ప్రారంభం చేయడం విధ్వంసమా?
Ø నాడు-నేడులో 16,880 ఆసుపత్రులను ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా బాగుచేసినందుకా? సామాన్య మానవుడికి ఉచితంగా మెరుగైన వైద్యం, పేద విద్యార్ధులకు మెడికల్ విద్య అందుబాటులోకి వస్తుందన్న ఆలోచనతో 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం విధ్వంసమా?
Ø మూడు పోర్టులు, ఒక ప్రైవేటు పోర్టు తో సహా, 10 షిప్పింగ్ హార్భర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం విధ్వంసమా?
Ø అమ్మఒడితో 44.48 లక్షల మంది తల్లులకు దాదాపు రూ.26,067 లబ్ధి చేయడం విధ్వంసమా?
Ø రైతు భరోసాతో 53.58 లక్షల మంది రైతులకు రూ.34,300 కోట్లు ఆర్ధిక సాయం అందించడం విధ్వంసమా? ఉచిత పంటల బీమా పెట్టి 54.55 లక్షల మంది రైతులకు ఇన్సూరెన్స్ ప్రభుత్వమే రైతుల తరపున కట్టి దాదాపు రూ.7,800 కోట్లు ఇన్సూరెన్స్ అందించడం విధ్వంసమా? సున్నా వడ్డీ పంట రుణాల కింద 84.64 లక్షల మంది రైతులకు దాదాపు రూ.2,051 కోట్లు వడ్డీ కూడా రైతుల తరపున ప్రభుత్వమే అందించడం విధ్వంసమా?
Ø ధరల స్థిరీకరణ నిధి కింద రూ.7,800 కోట్లు రైతుకు సాయం చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తే అది విధ్వంసమా ?
Ø వైయస్సార్ ఆసరా కింద దాదాపు 79లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.1 పైన, దాదాపు రూ.25,600 కోట్లు సాయం అందించడం విధ్వంసమా?
Ø సున్నా వడ్డీ కింద 1,05,13,500 మందికి దాదాపు రూ.5వేల కోట్లు వడ్డీ ప్రభుత్వమే అక్కచెల్లెమ్మల తరపున కట్టినందుకా విధ్వంసం జరిగింది?
Ø వైయస్సార్ చేయూత కింద 26,98000 మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.19,200 కోట్లు ఆదాయవనరులు పెంచడం విధ్వంసమా ?
Ø కాపునేస్తం కింద 3.58 లక్షల మందికి రూ.2030 కోట్లు సాయం, ఈబీసీ నేస్తం కింద ఇతర కులాలకు 4.95 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు దాదాపు రూ.1900 కోట్ల సాయం, వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కింద దాదాపు 56వేల మందికి రూ.450 కోట్లు అందిస్తే అది విధ్వంసమా?
Ø ఇళ్లు లేని వారికి 30 లక్షల ఇళ్ల పట్టాలందించడం, 20 లక్షల ఇళ్లు కట్టించడం వలన విధ్వంసం జరిగిందా?
Ø ఉద్యోగస్థులకు ఐఆర్ 27 శాతం ఇవ్వడం వలన విధ్వంసం జరిగిందా?
Ø కోవిడ్ సంక్షోభంలో ప్రజలకు సేవలందించిండంలోనూ, నివారణలోనూ వైయస్.జగన్ ప్రభుత్వం దేశంలో అత్యుత్తమ స్ధానాల్లో నిలిచినందుకా…
Ø దిశ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించినందుకా గాయం జరిగింది.
Ø పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమకు నీళ్లు తేవడమా? ఏది విధ్వంసం? గండికోట, చిత్రావతి, పులిచింతల ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించడమా విధ్వంసం
గత ప్రభుత్వములో విధ్వంసం జరిగిందని అంటున్న అమాత్యులు వీటన్నింటికీ సమాధానం చెప్పాలి, రాష్ట్రములో ఏ పేదవాడిని అడిగినా చెబుతారు వెళ్లి కనుక్కోండి అని యం.యల్.సి. వై. శివరామ రెడ్డి తనదైన శైలిలో తెలిపారు. వ్యవసాయమే లేని సింగపూర్ వెళ్లి వ్యవసాయ శాఖా మంత్రి ఏమి శిక్షణ పొందుతారో దేవుడికే తెలుసు అంటూ అయన ఎద్దేవా చేసారు. అమరావతిలో అంతులేని అవినీతి.. చదరపు అడుగుకు రూ. 14,800 నిర్మాణ వ్యయం చూపడం దారుణం. హైదరాబాద్, బెంగళూరులో రూ. 4 వేలకే అద్భుత కట్టడాలు వస్తుంటే.. ఇక్కడ మూడు రెట్లు ఎందుకు? కేవలం అమరావతి ప్లాన్ కోసమే రూ. 400 కోట్లు తగలేయడం ఏ రకమైన పరిపాలన? అంతే కాకుండా రాజధాని ప్రాంతములో వరద నీరు ఎత్తిపోయడానికి ఇప్పటికే పలుమార్లు వందల కోట్లు తగలేయడాన్ని కూటమి ప్రభుత్వములోని వారే విమర్శిస్తున్నారంటే ప్రజా ధనాన్ని ఎలా వృధా చేస్తున్నారో ప్రజలపై తీర్చలేని భారాన్ని ఎలా మోపుతున్నారో అర్థం చేసుకోవచ్చని అయన మండిపడ్డారు . మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరుతో పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ.5,500 కోట్లు దోచిపెట్టారు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి వేల కోట్ల అప్పులకు గ్యారంటీలు ఎందుకు ఇస్తున్నారు?రాజధానిలో మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలి, ఈ అప్పులు ఎవరు తీరుస్తారు? అమరావతిలో ఎకరం అభివృద్ధికి రూ. 2 కోట్లు ఖర్చవుతుందని మీ అంచనాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు లక్షల కోట్లు తెచ్చి మోయలేని భారాన్ని ప్రజలపై ఎందుకు మోపుతున్నారు? రాజధాని తప్ప మిగిలిన సంక్షేమ పటాకాలు పేదవారికి అందెదేప్పుడు? విద్యార్థుల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు రూ. 10 వేల కోట్లున్నా పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ. 2,600 కోట్లు.. పేదవాడి ఆరోగ్యం గాలికి వదిలేసారు నెట్‌వర్క్ ఆస్పత్రులు రోగులను చేర్చుకోవడం లేదు. వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది. ఆర్బీకేలు ఆగిపోయి రైతులు అధోగతి పాలయ్యారు. నాడు-నేడు పనులు నిలిచిపోయాయి.. స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. కేవలం రూ. 5 వేల కోట్లతో పూర్తయ్యే 17 మెడికల్ కాలేజీలను కూటమి సర్కార్ అటకెక్కించింది.మంజూరైన మెడికల్ సీట్లను కూడా వద్దని చెప్పడం రాష్ట్ర విద్యార్థులకు చేసే ద్రోహం. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలు ఎటుపోయాయి? అభివృద్ధి అంటే ఒక ప్రాంతాన్ని మాత్రమే వృద్ది చెయ్యడం కాదు. రాష్ట్రములో అన్ని ప్రాంతాలను సమతుల్యంగా వృద్ది చెయ్యడం. అలా వివిధ ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేసి సాంకేతికంగా వాటిని క్రోడీకరిస్తేనే అది అసలు సిసలైన అభివృద్ధి అని ఆయన తెలిపారు. హంద్రీనీవా ద్వారా అనంతపురము జిల్లా జీడిపల్లి రిజర్వాయర్ నుండి ముఖ్యమంత్రి జిల్లాకు నీరు తీసుకుపోతున్నారు, మరి జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం ఇప్పటిదాకా చెల్లించలేదే? నిర్వాసితులకు పరిహారం ఎప్పటిలోగా చేల్లిస్తారో చెప్పండి అని యం.యల్.సి. వై. శివరామ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని తనదైన శైలిలో ప్రశ్నించారు. అనంతపురము జిల్లాలో జీడిపల్లి రిసర్వాయర్ నందు నీటి నిల్వ సామర్థ్యం ప్రస్తుతానికి అదనంగా మరో 4.00 టి.యం.సి లు పెంచడానికి వీలుగా గత ప్రభుత్వములో రూ. 675 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆమోదము కొరకు పంపడం జరిగింది. ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ ను ప్రస్తుత కేటాయింపులలో ఆమోదించినట్లయితే రాయలసీమ త్రాగునీరు, సాగునీరు అవసరాలకు మరియు చిత్తూరు జిల్లా చివరి ఆయకట్టు వరకు నీరు అందించడానికి వీలుందని అలాంటి పనులు చేసి రాయలసీమ లోనే కరువుజిల్లా అయిన అనంతపురము జిల్లా ఋణము తీర్చుకొనే ప్రయత్నం చెయ్యండి అని యం.యల్.సి. వై. శివరామ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వములో కన్నానేడు గొడవలు , హత్యలు, మానభంగాలు ఎక్కువయ్యాయో లేదో గణాంకాలు తెలుపుతున్నాయని అయన మండిపడ్డారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనపడినట్టు విధ్వంసాలు, కుట్రలు చేసే వారికి అంతా మోసపూరితంగానే కనబడుతుందని అయన ఎద్దేవా చేసారు. ఆర్థికమాత్యులు తన పదవీకాలము పొడగించుకోడానికి, ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి జగన్ గారిపై అవాక్కులు చేవాక్కులు పేలితే సహించబోమని యం.యల్.సి. వై. శివరామ రెడ్డి తెలిపారు.
