తాడిమర్రి (yes9tv)చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో అవగాహన గ్రామ సభ నిర్వహించిన ఎస్సై కృష్ణవేణి యాదవ్
తాడిమర్రి, ఏప్రిల్ 26:
తాడిమర్రి మండలంలోని చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో స్థానిక ఎస్సై కృష్ణవేణి యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడే అవకాశాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంధనాన్ని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవాలని, నిల్వలు చేసుకునే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అలాగే రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, వేగంగా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు.
సైబర్ క్రైమ్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, తెలియని ఫోన్ కాల్స్, సందేశాలు, లింకులను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోకూడదని తెలిపారు.
వేసవి కాలంలో చిన్న పిల్లలు చెరువులు, బావులు వంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు కట్టుదిట్టమైన పర్యవేక్షణ వహించాలని సూచించారు. ముఖ్యంగా చిన్న ఆడపిల్లల విషయంలో ప్రస్తుత సమాజ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, భద్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణవేణి యాదవ్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులు ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రశంసించారు.
చిల్ల కొండయ్యపల్లి గ్రామంలో అవగాహన గ్రామ సభ నిర్వహించిన ఎస్సై కృష్ణవేణి యాదవ్
