తాడిమర్రి(yes9tv)తాడిమర్రిలో ఉపాధి హామీ పనులపై ప్రత్యేకాధికారుల పరిశీలన – కూలీలకు సూచనలు, ORS పంపిణీ
శుక్రవారం ఉదయం తాడిమర్రి మండల ప్రత్యేకాధికారి మరియు పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజు నాయక్ మండలంలోని ఆత్మకూరు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ నీటి సంరక్షణ పనులను ఎంపిడిఓ, ఏపీఓలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కూలీల హాజరు తక్కువగా ఉందని గుర్తించి, త్వరలో కూలీలకు డబ్బులు జమ అవుతాయని తెలియజేస్తూ హాజరు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఎఫ్‌ఏ తేజ, టీఏ అనురాధలకు సూచించారు.
అనంతరం తాడిమర్రి పంచాయతీలో జరుగుతున్న అమృత్ సరోవర్ పనుల వద్ద కూలీలతో సమావేశం నిర్వహించి ORS ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎంపిడిఓ మాట్లాడుతూ వేసవి కారణంగా ఎండలు అధికంగా ఉన్నందున ఉదయం తొందరగా పనులకు హాజరు కావాలని, వడదెబ్బ నివారణకు జాగ్రత్తలు పాటించాలని, ORS వినియోగించాలని సూచించారు. ఏవైనా అనారోగ్య సమస్యలు ఎదురైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జాతీయ పంచాయతీ రాజ్ దివస్‌ను కూడా అక్కడే నిర్వహించారు. అనంతరం SWPC షెడ్ పనితీరును పరిశీలించి గ్రీన్ అంబాసిడర్లతో చెత్త సేకరణ, నిర్వహణ, ఎరువుల తయారీ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు.
తరువాత ఎంపిడిఓ కార్యాలయంలో ఉపాధి హామీ మరియు జలధార కార్యక్రమాల ప్రగతిపై సమీక్ష నిర్వహించి మండలాన్ని జిల్లాలో అగ్రస్థానంలో నిలపాలని AE HNSS శ్రీధర్ మరియు ఉపాధి సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి, ఎంపిడిఓ, ఏపీఓ, పంచాయతీ కార్యదర్శి రిజ్వనా, టీఏలు అనురాధ, అరుణమ్మ, ఎఫ్‌ఏలు తేజ, గణేష్, వెంకట్రామిరెడ్డి తదితరులు, మేట్లు మరియు కూలీలు పాల్గొన్నారు.
