గుంతకల్లులో మధ్యప్రదేశ్ దొంగల ముఠా అరెస్ట్: భారీగా బంగారం, నగదు స్వాధీనం

 

గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్. CR.NO – 16/2026 U/S 331(4), 305(a) ,317 (2)BNS.
ముద్దాయిల పేర్లు.
1. అశోక్ @ అశోక్ ధ్యాన్ సింగ్ హజానార్, వయస్సు 37 సంవత్సరాలు, తండ్రి పేరు ధ్యాన్ సింగ్. భగోలి గ్రామం, కుక్సి తాలూకా, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రము.
2. రాజు సింగ్ మెహడా @ రాజు, వయస్సు 35 సంవత్సరాలు, తండ్రి పేరు లేట్ అగ్రేయా. భగోలి గ్రామం, కుక్ సి తాలూకా, ధార్ జిల్లా, మధ్యప్రదేశ్ రాష్ట్రము. మరియు మరో ముగ్గురు.

ప్రస్తుత రికవరీ : 72 గ్రాములు బంగారు నగలు మరియు 5,00,000/-రూపాయలు నగదు.

పై తెలిపిన A1 to A3 ముగ్గురు ముద్దాయిలు కలసి 22.02.2026 వతేదీన ఆనంతపురం టౌన్, 4TH టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు 23.02.2026 వతేదీన గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన ఇళ్ళలో దొంగతనం చేసి సుమారు 555 గ్రాములు బంగారు నగలు, 1500 గ్రాములు వెండి నగలు, RS. 2,20,000/- రూపాయలు దొంగతనం చేసిన విషయం తెలిసినదే.

• సదరు కేసును గౌరవనీయులు అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్, IPS గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రత్యేక చొరవచూపి ఎలాగైనా ఛేదించాలని గుంతకల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ A. శ్రీనివాస్ గారిని ఆదేశించినారు.
• గుంతకల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ A. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ B. మనోహర్ గారిని మరియు గుంతకల్ రూరల్ ఇన్స్పెక్టర్ N. ప్రవీణ్ కుమార్ గారిని రెండు టీములుగా విభజించి దొంగతనం జరిగిన రోజు నుంచి ఈరోజు వరకు సదరు కేసులోని A1 to A3 ముద్దాయిల కోసం అనునిత్యం గాలింపు చేపట్టడం అయినది.
• కేసు విచారణలో భాగంగా పలుమార్లు మధ్యప్రదేశ్ రాష్ట్రం, ధార్ జిల్లా, కుక్సి తాలూకా, తాండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సదరు కేసులోని ముద్దాయిల కోసం నిఘా ఉంచుతూ దర్యాప్తు కొనసాగించడం అయినది. సదరు కేసులోని A1 to A3 ముద్దాయిలు మరియు దొంగ సొత్తును కొనుగోలు చేసిన A4 & A5 ముద్దాయిలు చాలా కేసులలో గతంలో పట్టుబడిన వారు అయినందున మరియు అలవాటు పడిన నేరస్తులు అయినందున పోలీసుల కళ్ళు కప్పి పలు రాష్ట్రాలలో తప్పించుకుని తిరుగుతూ ఉండినారు.
• వీరిపై అనునిత్యం ప్రత్యేకంగా నిఘా ఉంచినందున సదరు కేసులోని ముద్దాయిలు గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో ఉన్నారని రాబడిన సమాచారం మేరకు గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ B.మనోహర్ మరియు గుంతకల్లు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ N.ప్రవీణ్ కుమార్ మరియు వారి సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి గుంతకల్లు టౌన్ డీజిల్ షెడ్ రోడ్ అంబేద్కర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి A1 to A2 ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 72 గ్రాములు బంగారు నగలు మరియు 5,00,000/-రూపాయలు నగదు ను స్వాధీనపరచుకొని పరచుకోవడమైనది.
• ఈ కేసులలో దొంగతనం చేసిన మూడవ ముద్దాయి, దొంగలించిన దొంగ సొత్తును అమ్మి డబ్బులు ఇస్తామని దొంగ సొత్తు కలిగి ఉన్న మరో ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నారు వీరిని కూడా తొందరగానే అరెస్టు చేసి మిగిలి ఉన్న బంగారు నగలను వెండి నగలను రికవరీ చేసి బాధితులకు అప్పచెబుతామని తెలియజేస్తున్నాము.
• సదరు A1 to A2 ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రాజశ్రీ గుంతకల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి వద్దకు రిమాండ్ నిమిత్తం పంపడం జరుగుతుందని తెలియజేస్తున్నాము.
• ఈ కేసులో ప్రతిభ కనబరిచినటువంటి ఇన్స్పెక్టర్లు B.మనోహర్, N.ప్రవీణ్ కుమార్, కసాపురం ఎస్సై వెంకటస్వామి, విడపనకల్ ఎస్సై ఖాజా హుస్సేన్, గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ కళ్యాణ్, హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ రఘు, జాఫర్, కిషోర్, సునీల్ కుమార్, పాపానాయక్, ఎల్లప్ప, రమేష్, హరీ, అంజి, నాగేశ్వరరావు, లను అధికారులు అభినందించినారు.
B.మనోహర్.
గుంతకల్ 1 టౌన్ పోలీస్ స్టేషన్.

Posted Under AP
Editor