ముదిగుబ్బ యస్ 9
మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఉమ్మడి అనంతపురం జిల్లా విశాలాంధ్ర బ్యూరో చీఫ్ డాక్టర్ ఎస్. జయ నందన్ రెడ్డి, మానవ హక్కుల జాతీయ కన్వీనర్ బాసినేని వెంగమేష్ చౌదరిల ఆధ్వర్యంలో చల్లని తాగునీటితో ప్రత్యేక చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదిగుబ్బ అర్బన్ సీఐ శివరాముడు, రైల్వే స్టేషన్ మాస్టర్ నాగభూషణ చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ శివరాముడు మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఉచిత చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అభినందన దగ్గర విషయమని అన్నారు. ఈ ఎండాకాలంలో రైల్వే స్టేషన్ కి వచ్చే ప్రయాణికులతో పాటు వృద్ధులు చిన్నారులుకు ప్రయాణికులు, సాధారణ ప్రజలు దాహార్తిని తీర్చుకునేందుకు ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా మంచి మంచి విషయమని వారిని అభినందించడం జరిగింది.
ఈ చలివేంద్రం ద్వారా రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులు, కూలీలు, వృద్ధులు, చిన్నారులు సహా అందరికీ శుభ్రమైన, చల్లని తాగునీరు అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఈ చలివేంద్రాన్ని వినియోగించుకుని ఉపశమనం పొందుతున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎస్. జయ నందన్ రెడ్డి, మానవ హక్కుల జాతీయ కన్వీనర్ బాసినేని వెంగమెష్ చౌదరి మాట్లాడుతూ, “ప్రజలకు అవసరమైన సమయంలో సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. వేసవి కాలంలో నీటి కొరతతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చిన్న సహాయం అయినా చేయాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టాం” అనివారు తెలిపారు.
ఇక, స్థానికులు మరియు ప్రయాణికులు ఈ చలివేంద్రం ఏర్పాటుపై సంతోషం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింతగా కొనసాగించాలని కోరుకున్నారు. డాక్టర్ జయ నందన్ రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండి, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టేషన్ మాస్టర్ నాగభూషణం,పట్టణ నాయకులు ప్రజలు అందరూ పాల్గొన్నారు.
మండల కేంద్రంలో చలివేంద్రం ఏర్పాటు – ప్రయాణికులకు ఉపశమనం
