Latest Posts

ఆలూరులో వరుణుడి బీభత్సం: వర్షపాతం వివరాల వెల్లడిలో ఏఎస్ఓ నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

– కర్నూలు జిల్లా ఆలూరు లో -భారీ వర్షం తర్వాతా వర్షపాతం వివరాలు ప్రకటించని ASO ఈశ్వర్ అధికారీ.!
–పిడుగులు, మెరుపులతో ప్రజల్లో భయం..అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన…

ఆలూరు ప్రాంతంలో బుధవారం రాత్రి పిడుగులు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. రాత్రి పొడవునా ఉరుములు, మెరుపులు, పిడుగులు పడటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా కూడా అంతరాయం కలిగినట్లు సమాచారం. అయితే ఇంత భారీ వర్షం కురిసినప్పటికీ, ఆ వర్షపాతం శాతం లేదా గణాంక వివరాలను ఇప్పటివరకు రెవెన్యూ శాఖ అధికారులు గానీ, గణాంకాల విభాగం గానీ అధికారికంగా ప్రకటించకపోవడం స్థానిక ప్రజల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాతావరణ పరిస్థితులు తీవ్రంగా ఉన్న సమయంలో అధికారుల నుంచి ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేదా తాజా సమాచారం అందకపోవడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజల భద్రత అత్యంత ముఖ్యమని, కనీసం వర్షపాతం వివరాలు, హెచ్చరికలు సమయానికి అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్థానికులు అంటున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Posted Under AP
Editor