Latest Posts

విద్యార్థుల కష్టాలకు చెక్: మంత్రి సత్య కుమార్ చొరవతో తాడిమర్రి పాఠశాలకు బస్సు సౌకర్యం

తాడిమర్రి(yes9tv)తాడిమర్రి మండలంలోని పల్లెల నుండి ఉన్నత పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ కాలినడకన ప్రయాణించాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం మండల అధ్యక్షుల దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు.
ఈ సమస్యను గమనించిన మండల అధ్యక్షులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై . సత్య కుమార్ యాదవ్ గారికి వినతి పత్రం అందజేశారు. మంత్రి గారు వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రాంతీయ మేనేజర్‌తో మాట్లాడి, విద్యార్థులకు తక్షణమే బస్సు సౌకర్యం ఏర్పాటు చేయించారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. మంత్రి గారి చొరవతో తాడిమర్రి ఉన్నత పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించబడటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే పాఠశాల యాజమాన్యం ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ బస్సు సౌకర్యం ద్వారా లాభపడుతున్న గ్రామాలు:
పుల్లనారాయణపల్లి
భీమరాయనిపేట
మద్దెలచెరువు
శివంపల్లి
అగ్రహారం
మరువపల్లి
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు G. ఎం . శేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు దేవర రామ్మోహన్ గారు పాల్గొన్నారు.

Posted Under AP
Editor