చిన్నారి కేయాంశ్ ప్రాణాన్ని కాపాడండి: హిందూపురంలో భారీ అవగాహన ర్యాలీ

శ్రీ సత్య సాయి జిల్లా, హిందూపురం.

శ్రీ సత్య సాయి జిల్లా…. లేపాక్షి కి చెందిన నాలుగేళ్ల చిన్నారి కేయాంశ్ SMA టైప్-2( స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 2)అనే ప్రాణాంతక వ్యాధికి చికిత్స అందించేందుకు విరాళాల కోసం హిందూపురంలో భారీ ర్యాలీ జరిగింది. ప్రాణాంతక వ్యాధి చికిత్స కోసం అవసరమైన ఇంజెక్షన్ ఖర్చు సుమారు 16 కోట్లు కాగా, గత రెండు నెలలుగా నిధుల సేకరణకొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు తగిన మొత్తం జమ కాలేదు. కేయాంశ్ ప్రాణాన్ని కాపాడేందుకు హిందూపురం ప్రాంత ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు పలు రాజకీయ పార్టీల నాయకులు.పట్టణం లోని చిన్న మార్కెట్ నుండి గాంధీ సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది. ఇన్‌ఫ్లూయెన్సర్లు, యువత, సేవాభావం కలిగిన వ్యక్తులు కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. కేయాన్ష్ ను కాపాడండి విరాళాలు అందించి సహాయం చేయండి అంటూ నినాదాలు చేశారు. విరాళాలతోపాటు ప్రభుత్వం ఆదుకొని బాధిత బాలుడికి ఆర్థిక సాయం అందించి కాపాడాలంటూ కోరారు.

బైట్స్.

1) ఎమ్మెల్యే పిఏ వీరయ్య.
2) క్యాయాన్స్ తండ్రి నటరాజ్.

Posted Under AP
Editor