తాడిమర్రి( yes9tv)తాడిమర్రి మండల రైతులకు ముఖ్య సమాచారం – ఖరీఫ్ పంటలకు నార అందుబాటులో
తాడిమర్రి మండలంలోని అన్ని గ్రామాల రైతులు రాబోయే ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. అవసరమైన రైతులు వెంటనే సంప్రదించవలసిందిగా కోరుతున్నారు.
రెడ్డిపల్లి లోని కృషి విజ్ఞాన కేంద్రం (KVK) వద్ద కూరగాయలు, మునగ, బొప్పాయి మరియు పూల నారలను పెంచి రైతులకు అందజేస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఉద్యానవన రైతులకు అవసరమైన నాణ్యమైన నారలను అందుబాటులో ఉంచుతున్నట్లు ఉద్యానవన శాస్త్రవేత్త డా. జి. త్రికల మాధవి తెలిపారు.
రైతులు తమకు కావలసిన నారను పొందడానికి కనీసం 30 రోజుల ముందుగా (ఒక నెల ముందుగా) ఇండెంట్ ఇవ్వవలసి ఉంటుంది. రైతుల అవసరాలకు అనుగుణంగా తగిన రకాలను పెంచి సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యానవన యూనివర్సిటీ ద్వారా విడుదలైన ఉత్తమ రకాల నారలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని పొందాలనుకునే రైతులు ముందుగానే ఇండెంట్ ఇవ్వాలని సూచించారు.
ఇతర వివరాల కోసం రైతులు ఈ క్రింది ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు:
📞 9949737160
తాడిమర్రి మండల రైతులకు ముఖ్య సమాచారం – ఖరీఫ్ పంటలకు నార అందుబాటులో
