లింగ నిర్ధారణ చట్టరీత్య నేరం… అనంతపురం ఆర్ డి ఓ కేశవ నాయుడు

అనంతపురం జిల్లా, టౌన్.

 

లింగ నిర్ధారణ చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు.
సోమవారం ఉదయం తన కార్యాలయంలో పి సి పి ఎన్ డి టి కమిటీ డివిజన్ స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ గర్భస్థ లింగ నిర్ధారణ పై విస్తృతంగా అవగాహన కల్పించేందుకు అవసరమైన మేరకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా కళాశాలలోని కిశోర యువతులకు అవగాహన కల్పించాలని ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రదర్శన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. సమాజంలో ఈ అంశంపై మార్పు తీసుకురావడానికి గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టం బహుళ సభ్యుల కమిటీ కృషి చేయాలన్నారు
ముఖ్యంగా భవిష్యత్ తరాల్లో లింగ వివక్ష లేని తల్లులు తయారు చేసేందుకు ఇప్పటినుండే అవగాహన కార్యక్రమాలుచేపట్టాలన్నారు. లింగ నిర్ధారణ జరుగుతున్న ఏ చిన్న సమాచారం అందిన కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో హెచ్చరించారు.
అనంతరం అనంతపురం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ మిషనరీ ఏర్పాటుకు మరో రెండు యూనిట్ల రెన్యువల్ కు అనుమతిని మంజూరు చేస్తూ కమిటీ బృందం ఆమోదం తెలిపింది.
ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి ప్రోగ్రాం ఆఫీసర్ ఈ .నాగరాజు, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, ఆర్డిటి హెల్త్ డైరెక్టర్ దుర్గేష్, చిన్నపిల్లల వైద్య నిపుణులు రవికుమార్, రెడ్స్ డైరెక్టర్ భానుజా , పెథాలజిస్ట్ డా. భవాని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సుబ్బలక్ష్మి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు న్యాయ సలహాదారులు సంధ్యారాణి ఆషారాణి డెమో సిబ్బంది వేణు, కిరణ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor