పాలిసెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి…. డిఆర్ఓ ఎ.మాలోల

అనంతపురం జిల్లా, కలెక్టరేట్.

 

అనంతపురం, జిల్లా
ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్-2026 ప్రవేశ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో కూడా ఆ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి
ఎ. మాలోల ఆదేశించారు.
సోమవారం ఉదయంకలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో పాలిసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా డిఆర్ఓ మాలోల మాట్లాడుతూ 3 సంవత్సరాల డిప్లమా కోర్సులలో ప్రవేశం కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించడంజరుగుతున్నదన్నారు. ఈనెల 25న ఉదయం 11 గం”నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందని జిల్లాలోని ఆరు పట్టణ కేంద్రాలలో మరియు 31 పరీక్ష కేంద్రాలలో సుమారు 9745 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురంలో 12 కేంద్రాలు కళ్యాణ్ దుర్గం 4 గుంతకల్ గుత్తి 2 ఉరవకొండ 2 తాడిపత్రి 8 కేంద్రాలలోప్రవేశ పరీక్ష జరగనున్నదని పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు, రెవెన్యూ, విద్యా, విద్యుత్, ఏపీఎస్ఆర్టీసీ, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ శాఖ లుప్రత్యేక చర్యలు తీసుకొని ప్రవేశ పరీక్షను విజయవంతం చేయాలన్నారు.
పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు కేంద్రాలకు తగినంత సిబ్బంది మరియు సాయుధ దళాలను నియమించాలని అలాగే అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రెవెన్యూ శాఖ నుండి ఫ్లయింగ్ స్క్వాడ్ విద్యా, పోలీస్ శాఖలు పర్యవేక్షణ చర్యలు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలని ప్రతి పరీక్ష కేంద్రానికి తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు ప్రథమ చికిత్స కిట్లతోపాటు అక్కడి పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆశా ఇతర ఆరోగ్య కార్యకర్తలను నియమించాలని డిఆర్ఓ తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ ద్వారా అన్ని ప్రాంతాలకు తరచుగా బస్సు సర్వీసులను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మరియు పంచాయతీ పరిధిలోని అధికారులు అన్ని పరీక్ష కేంద్రాలలో పారిశుధ్యం మరియు ఇతర సౌకర్యాలను కల్పించే విధంగా చర్యలు తీసుకొని తగినంత తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
పరీక్ష ప్రశ్నా మరియు జవాబు పత్రాల తరలింపులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఈసమావేశంలోఅనంతపురం పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపాల్ మరియు పాలి సెట్ కన్వీనర్ జయ చంద్ర రెడ్డి, ఉరవకొండ పాలిటెక్నికల్ కళాశాల ప్రిన్సిపల్ అష్రఫ్ అలీ, గుంతకల్ ప్రిన్సిపాల్ రమణారెడ్డి గుత్తి ప్రిన్సిపాల్ రఘునంద్, కళ్యాణ్ దుర్గం ప్రిన్సిపాల్ బాదుషా తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor