అనంతపురం జిల్లా, కలెక్టరేట్.
– *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించగా, ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ అర్జీలను స్వీకరించారు.*
– *జాయింట్ కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ ఏ.మలోల, జిల్లా ఫారెస్ట్ సెటిల్మెంట్ అధికారి జి.రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, రమేష్ రెడ్డి, మల్లికార్జునరెడ్డి, ఆనంద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 504 అర్జీలను జాయింట్ కలెక్టర్ స్వీకరించారు. అర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు అక్కడికక్కడే జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.*
– *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పిజిఆర్ఎస్ అర్జీలను ఎప్పటికప్పుడు నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యను పరిష్కరించే క్రమంలో సంబంధిత శాఖ అధికారులు అత్యంత ప్రాధాన్యత తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా పిజిఆర్ఎస్ కార్యక్రమంలో స్వీకరించిన వినతులను ఎండార్స్మెంట్ చేసి ఆయా అర్జీదారులకు అందజేయాలని తెలిపారు. పిజిఆర్ఎస్ కు సంబంధిత శాఖ అధికారులు హాజరు కాలేక పోయినప్పుడు వారి ప్రతినిధిగా వచ్చిన అధికారి పూర్తి స్థాయిలో నివేదించాల్సి ఉంటుందన్నారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని ఆదేశించారు.*
– *అలాగే జనగణన నమోదు ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు. అన్ని ప్రభుత్వ శాఖలలోని అధికారులు, ఉద్యోగ సిబ్బంది, డిఆర్డిఏ, మెప్మా, వ్యవసాయ, తదితర శాఖ పరిధిలో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. ఈనెల 21వతేదీన మంగళవారం రాష్ట్ర ఎస్సీ కమిషన్ జిల్లాకు రానున్న నేపథ్యంలో సంబంధిత శాఖ అధికారులు పూర్తి నివేదికలను సిద్ధం చేసుకుని సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అలాగే ఎస్సీ ఫిర్యాదుల పరిష్కార నివేదికలు కూడా తీసుకురావాలని జెసి సూచించారు.*
– *ఈనెల 29 న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశం మరియు నూతన కార్యవర్గం ఏర్పాటు జరగనున్నదని జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మాలోల తెలిపారు. అనంతపురం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ లోని జీవిత కాలం సభ్యులు, సభ్యత్వం కలిగిన సభ్యులు మాత్రమే రెడ్ క్రాస్ గుర్తింపు కార్డుతో ఆరోజు ఉదయం 10 గంటలకు రెవెన్యూ భవన్ కలెక్టర్ కార్యాలయంలో హాజరు కావాలని తెలిపారు.*
– *ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, జిల్లా వ్యవసాయ అధికారి రవి, డిసిఓ అరుణకుమారి, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, డిటిడబ్ల్యుఓ శ్రీనివాసరావు, బిసి వెల్ఫేర్ డిడి ఖుష్బూ కొఠారి, డిటిసి వీర్రాజు, ఏపిఎస్ఆర్టిసి ఆర్ఎం శ్రీలక్ష్మి, జిల్లా టూరిజం అధికారి జయ కుమార్ బాబు, డిఆర్డిఏ పిడి శైలజ, ఆర్.అండ్.బి ఎస్ఈ మురళీకృష్ణ, చేనేత జౌళి శాఖ ఏడి వరప్రసాద్, పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి ప్రేమ్ చంద్, హౌసింగ్ పిడి శైలజ, ఎల్డిఎం నరేష్ రెడ్డి, డ్వామా పిడి సలీమ్ భాష, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, డిఎస్ఓ వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రెడ్డి, కలెక్టరేట్ సెక్షన్ సూపరింటెండెంట్లు రియాజుద్దీన్, వసంతలత, ఆయా శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*
