చంద్రబాబు పుట్టినరోజున అంబికా ఫౌండేషన్ సేవా పథం: 130 మందికి ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ!

అనంతపురం జిల్లా, టౌన్

 

*ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం*
– అనంతపురం నగరంలోని క్రొత్తవూరు వాసవీ కళ్యాణ మండపంలో సోమవారం అంబికా ఫౌండేషన్ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచిత వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిచే ఘనంగా నిర్వహించబడింది. ఇందులో ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. ONGC సంస్థ CSR నిధుల నుండి సుమారు రూ.30 లక్షల వ్యయంతో భారతీ సామాజిక్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత వినికిడి యంత్రాలను ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అంబికా ఫౌండేషన్ చైర్మన్ అంబికా విక్షిత్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 280 మంది చెవిటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అందులో అర్హత కలిగిన 130 మందికి ఆధునిక వినికిడి యంత్రాలను ఉచితంగా అందజేశారు. మిగిలిన వారందరికి మరో విడత వినికిడి యంత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించి అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న 10 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు అందజేసారు. ఈ వినికిడి యంత్రాల ద్వారా వారికి వినికిడి సామర్థ్యం మెరుగుపడి, వారి దైనందిన జీవితంలో సౌలభ్యం కలగనుంది.

– ఈ సందర్భంగా అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ప్రజల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారని తెలిపారు. ప్రత్యేకంగా పేదలు, వృద్ధులు, వికలాంగులు మరియు అవసరమైన వారికి ప్రభుత్వ సహాయం చేరేలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల సేవే లక్ష్యంగా పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా అంబికా ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించి ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

– ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ అధికారి ప్రశాంత్ శుక్లా, ఓఎన్‌జీసీ అధికారి అంకుష్ యాదవ్, జీజీహెచ్ ఆడియాలజిస్ట్ కె.నరేంద్ర, జీజీహెచ్ ఆడియాలజిస్ట్ లు కృష్ణ వేణి, పి.నాగిరెడ్డి, గణేష్ రెడ్డి, వై.సమీరా, డబ్ల్యూడీఏ టీజీ & ఎస్‌జీ అసిస్టెంట్ డైరెక్టర్, సెక్రటరీ నాగభూషణ, కార్యవర్గ సభ్యుడు సత్యరాం, ONGC కంపెనీ ప్రతినిధులు, ENT నిపుణులైన వైద్యులు మరియు సిబ్బంది, సాయినాథ్ గారు, అంబికా ఫౌండేషన్ వాలంటీర్లు, నాయకులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor