ఉరవకొండ మండలం వెలిగొండ గ్రామంలో శనివారం రోజున వెలిగొండ నంబర్ వన్ టూ అంగనవాడి సెంటర్ నందు పోషణ పక్వాడలో భాగంగా అంగన్వాడి కేంద్రం నందు తల్లులను సమావేశపరిచి పిల్లలకు జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, మొబైల్ స్క్రీన్ వినియోగం వల్ల కలిగే మానసిక ,శారీరక సమస్యలపై చర్చించడం జరిగినది. పిల్లలకు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినిపించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తల్లులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సీడీపీఓ శ్రీదేవి, సూపర్వైజర్ ర్రాజేశ్వరి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
