- నల్లమాడ లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీ
- ర్యాలీలో పాల్గొన్న డిఎల్ డి వో నవీన్ కృష్ణ.
నల్లమాడలో స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నల్లమాడ మండల కేంద్రం లోని స్థానిక కస్తూరిభా గాంధీ బాలికల పాఠశాల లో వాటర్ పాజిటివ్ ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో భూగర్భ జలాల పెరుగుదల, నీటి వృధా వల్ల కలిగే నష్టాలు,ఇంకుడు గుంతల ఆవశ్యకత మరియు పరిశుభ్రత గురించి ప్రసంగించడం జరిగింది.
ఈకార్యక్రమంలో కేజీబీవీ విద్యార్థులు, వివిధ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజలతో స్కూల్ నుండి బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ మానవహారంగా ఏర్పడి, స్వచ్ఛ ఆంధ్ర.. స్వర్ణ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు, స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రాముఖ్యతను వివరించి, భూగర్భ జలాల పెంపు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో పుట్టపర్తి డిడిఓ నరేషకృష్ణ, జీసీడిఓ అనిత, ఎంపీడీవో అంజనప్ప, డిప్యూటీ ఎంపీడీవో మున్ఆఫ్ ఏవో శ్రీనివాస్ ఎస్ఓ లక్ష్మీ, ఏపీఎం గోపాల్, ఏపిఎం రఘునాథ్ రెడ్డి, స్వచ్ఛ భారత్ మండల కోఆర్డినేటర్ గంగాధర్, నల్లమాడ మండల నాయకులు విద్యార్థులు మరియి ప్రజలు పాల్గొన్నారు.
