Latest Posts

కార్ల బాడుగ పేరిట ఘరానా మోసం: నిందితుడిని అరెస్ట్ చేసిన నల్లమాడ పోలీసులు

కార్లను బాడుగకు తీసుకొని అద్దె చెల్లిస్తాను అంటూ యజమానులను మోసం చేసిన కేసులో వ్యక్తి అరెస్ట్
శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం
కేసు వివరాలను మీడియాకు వెల్లడించిన నల్లమాడ సర్కిల్ సిఐ శ్రీనివాసులు

కేసు వివరాలు:
ముద్దాయి వివరాలు:
అన్నవరం గౌతం రాజు వయసు 33 సం.లు, తండ్రి, అన్నవరం నరస రాజు, సత్యసాయి నగర్ హిందూపురం టౌన్ శ్రీ సత్యసాయి జిల్లా, ప్రసుతం నల్లమాడ గ్రామము & మండలం.
బాధితుడు:
కే.ప్రేమ నాథ్ రెడ్డి, వయసు 37 సం.లు, తండ్రి కే. నాగ మోహన్ రెడ్డి, చెరువువాండ్ల పల్లి నల్లమాడ మండలం.

కేసు చేధింపు వివరాలు:
శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో …
నల్లమడ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా V. శ్రీనివాసులు ఉత్తర్వులు మేరకు మరియు నల్లమడ ఎస్సై గారు M. సతీష్ మరియు ఏఎస్ఐ ఎం సత్యనారాయణ మరియు సిబ్బంది G. రంగస్వామి M. ప్రతాప్ నాయక్ ప్రత్యేక చొరవ చూసుకొని కేసును చేదించినారు దాని యొక్క వివరాలు.

17-04-2026 తేదీ ఉదయం సుమారు 08.00 గంటలకు నల్లమాడ మండలం Y.S.R సర్కిల్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని పోలీసులు గుర్తించారు.

పోలీసుల రాకను గమనించిన ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా, దర్యాప్తు అధికారి M. సత్యనారాయణ (ASI) తన సిబ్బందితో కలిసి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అతను తనను అన్నవరం గౌతం రాజు (33 సం||లు), హిందూపురం నివాసి అని తెలిపాడు.

ముద్దాయి బెంగళూరులో ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తూ జీవనం సాగించేవాడని, అయితే ఆ ఆదాయం సరిపోక అక్రమ మార్గాలను ఆశ్రయించినట్లు ఒప్పుకున్నాడు.

ముద్దాయి తనకు పరిచయమున్న వ్యక్తి ద్వారా నల్లమాడ మండలానికి చెందిన వ్యక్తుల వద్ద నుండి కార్లు తీసుకునే కుట్ర పన్నాడు.”

కార్ల యజమానులను నమ్మబలికి, “EMI మరియు బాడుగ చెల్లిస్తాను” అని చెప్పి వారి వద్ద నుండి కార్లు పొందాడు.

యజమానులకు తెలియకుండా ఆ కార్లను ముగ్గురు వ్యక్తులకు కుదువ పెట్టి భారీ మొత్తంలో నగదు స్వీకరించాడు.

ఈ విధంగా వేర్వేరు వ్యక్తుల వద్ద నుండి లక్షల రూపాయలు తీసుకున్నాడు.

ప్రారంభంలో యజమానులకు అనుమానం రాకుండా ఒక నెల EMI/ బాడుగ చెల్లించి, తరువాత పూర్తిగా చెల్లింపులు నిలిపివేశాడు.

బాధితులు ఫోన్ ద్వారా సంప్రదించినా స్పందించకుండా తప్పించుకుని, నల్లమాడ నుండి నెల్లూరు కు వెళ్లి అక్కడ నివసిస్తున్నాడు.

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముద్దాయి చూపిన మేరకు క్రింది మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు:

KA 03 NU 9190 (Maruti Suzuki Swift LXI)

Ο ΚΑ 02 ΜΗ 8290 (Volkswagen Polo)

KA 03 NU 4629 (Maruti Suzuki Brezza LXI)

స్వాధీనం చేసిన వాహనాలను సీజ్ చేసి, కోర్ట్ లో హాజరుపరచడం జరుగుతుంది.

రిమాండ్ నిమితం కోర్ట్ లో హాజరు పరచడమైనది

ఈ చాకచక్యంగ చేదించిన సిబ్బందిని CI గారు అబినందిచడమైనది.

Posted Under AP
Editor