అనంతపురం జిల్లా, రాయదుర్గం.
తాగునీటి సరఫరా మా తక్షణ కర్తవ్యం: ఎమ్మెల్యే కాలవ.
తాగునీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణ పరిధిలోని పైతోటలో కొత్తగా నిర్మించిన రక్షిత మంచినీటి సరఫరా ట్యాంకులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాయదుర్గం పట్టణ పరిధిలోని 20, 21 రెండు వార్డుల్లోనూ రూ.6 లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేసి ట్యాంకులు ఏర్పాటు చేశామన్నారు. పైతోట ప్రాంతం ఊరికి విసిరేసినట్టు ఉండే శివారు ప్రాంతమన్నారు. రూ.70 లక్షలు ఖర్చుపెట్టి తాగునీటి పైప్లైన్ నిర్మించడం జరిగిందన్నారు. అలాగే అమృత్ _2 పథకం కింద
సురక్షితమైన నీటిని అందించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వేసవిలో నీటి ఎద్దడి రాకుండా బోరు వేయిస్తే మంచినీరు పడటం చాలా ఆనందదాయకమన్నారు. ఆ మంచినీటిని సరఫరా చేస్తుండటం అక్కడ మహిళలందరూ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎక్కడికక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా మంచి నీటిని సరఫరా చేయడం తక్షణ కర్తవ్యం గా పెట్టుకున్నామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం అవసరమైన అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన పనులు మంజూరు చేయించుకున్నామని, రాబోయే ఆరేడు నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మార్కెట్ యార్డ్ చైర్మన్ హనుమంత రెడ్డి, పైతోట రామంజి, మధు ,సినా,అంజి మాజీ కౌన్సిలర్లు టoకశాల హనుమంతు,ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
