కర్ణాటక రాష్ట్రం, విజయనగరం జిల్లా, హోస్పేట్ తుంగభద్ర.
*”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణం*
– *: ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి, కొత్తవి నిర్మించడం దేశంలోనే ఓ రికార్డు*
– *: రాయలసీమ రైతుల ప్రయోజనాలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది*
– *: రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వం ఎంత వరకు అయినా వెళుతుంది అనడానికి డ్యాం వద్ద జరుగుతున్న పనులు నిదర్శనం*
– *: రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్
– *కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ గేట్ల నిర్మాణ పనులను మంగళవారం ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, బోర్డు అధికారుల తో కలిసి రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా తుంగభద్ర డ్యామ్ గేట్ల మార్పిడి మరియు కాలువల ఆధునీకరణ పనుల పురోగతిని ప్రెస్ మీట్ లో మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, విప్ కాలవ శ్రీనివాసులు వివరించారు.*
– *ఈ సందర్భంగా మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ”గో ఆల్ అవుట్” అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పదమే తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల నిర్మాణానికి కారణమన్నారు. ఒక సీజన్ లో డ్యాం 33 గేట్లు తొలగించి, కొత్తవి నిర్మించడం దేశంలోనే ఓ రికార్డు అన్నారు. గడువు కంటే ముందే నిర్మాణ సంస్థ పనులు పూర్తి చేయనుందన్నారు. వచ్చే సీజన్ కి డ్యాం 33 గేట్లు అమరిక పూర్తి అవుతుందన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడటానికి ప్రభుత్వం ఎంత వరకు అయినా వెళుతుంది అనడానికి ఇక్కడ జరుగుతున్న పనులు నిదర్శనమన్నారు. గత సీజన్ లో హంద్రీనీవా వెడల్పు పనులు పూర్తి చేసి చూపించామన్నారు. మాటలతో కాదు చేతులతో పనులు చేసి చూపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో గేట్లు, డ్యాంలు కొట్టుకుపోయినా స్పందించలేదని, టీబీ డ్యాంలో ఒక్క గేటు కొట్టుకుపొతే పారుతున్న నీటికి అడ్డుకట్ట వేసి అప్పట్లో రైతుల ప్రయోజనాలు కాపాడగలిగామని, రాయలసీమ రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. తుంగభద్ర ఆనకట్టలోని గేట్ల ప్రస్తుత పరిస్థితిపై నిపుణుల కమిటీ మరియు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారని, గత ప్రభుత్వాల హయాంలో గేట్లు సరిగా లేవని నివేదికలు వచ్చినా, వాటిని పట్టించుకోలేదన్నారు. ఒకే సీజన్‌లో పాత గేట్లను తొలగించి, కొత్త గేట్లను తయారు చేసి, వాటిని అమర్చడం ఒక పెద్ద ప్రక్రియ అని, 60 అడుగుల పొడవు గల ఈ గేట్లను రవాణా చేయడం కూడా ఒక సవాలుతో కూడుకున్న పని అన్నారు. గేట్ల పునరుద్ధరణ విషయంలో నిపుణులు కన్నయ్య నాయుడు వంటి నిపుణుల సలహాలను తీసుకున్నామని, సి.డబ్ల్యు.సి (CWC) మరియు ఇతర నిపుణుల కమిటీలు కూడా ఈ ప్రక్రియలో భాగమయ్యాయన్నారు. ముఖ్యమంత్రి “గో ఆల్ అవుట్” (Go All Out) అని ఆదేశిస్తూ, రైతు ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకోమని చెప్పారని, కర్నాటక ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి, తగిన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మొత్తం 33 గేట్లను మార్చాలని నిర్ణయించుకోగా, ప్రస్తుతం కొన్ని గేట్ల పనులు పూర్తి కావచ్చాయని, డ్యామ్ వద్ద మొత్తం 18 గేట్లను విజయవంతంగా అమర్చారని, ప్రస్తుతం వెల్డింగ్ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. పనులను మే నెల నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, పనుల వేగం చూస్తుంటే అంతకంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి చిన్న అంశాన్ని (బాటమ్ గార్డర్, మిడిల్ గార్డర్, టాప్ గార్డర్, స్కిన్ ప్లేట్ మరియు రబ్బర్ సీల్స్) క్షుణ్ణంగా మానిటర్ చేస్తూ, పక్కా ప్రణాళికతో పనులు జరుపుతున్నారన్నారు. 2014-19 మధ్య కాలంలోనే ఈ పనుల కోసం ప్రయత్నాలు జరిగాయిని, అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు సిద్ధరామయ్య (కర్ణాటక) మధ్య జరిగిన చర్చల ఫలితంగా, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా ఆధునీకరణ చేయడానికి అంగీకారం కుదిరిందన్నారు. కాలువల ఆధునీకరణలో కర్ణాటక బోర్డర్ పరిధిలోని కిలోమీటర్లను ఆధునీకరించారని, 37వ కిలోమీటర్ వద్ద ఉన్న టన్నెల్ (Tunnel) లో పేరుకుపోయిన అడ్డంకులను తొలగించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ గేట్ల మార్పిడి వల్ల రాబోయే 50 ఏళ్ల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, రైతులకు నమ్మకాన్ని కలిగించడమే తమ ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. గేట్లతో పాటు పాత చైన్లను కూడా మార్చాలని అధికారులు నిర్ణయించారన్నారు. తొమ్మిది గేట్లు 100 శాతం వెల్డింగ్ పూర్తి చేసుకున్నాయని, మరో తొమ్మిది గేట్లు కూడా త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. ఈ 33 గేట్లు అన్నీ పూర్తి చేసి మే నెల కల్లా నీళ్లు నిల్వ చేసేలా చూస్తామన్నారు. డ్యాం గేట్లు మరియు చైన్లను కూడా మార్చమని అధికారులకు సూచించినట్లు తెలిపారు. గేట్ల పనులు మే నెలలోగా పూర్తి చేసి, వచ్చే వర్షాకాలం నాటికి రైతుల నమ్మకాన్ని నిలబెడతామన్నారు. పనులు జరుగుతున్నాయా లేదా అని అధికారులను ఫోటోలు పంపమని అడిగి, నిరంతరం పర్యవేక్షించినట్లు చెప్పారు. హంద్రీ-నీవా వెడల్పు పనుల కంటే ఈ గేట్ల విషయంలో ఎక్కువ భయం ఉండిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రోత్సాహం, మంత్రి రామానాయుడు గారి మద్దతు మరియు కర్ణాటక ప్రభుత్వ సహకారాన్ని కొనియాడారు. సంబంధిత అధికారులు చాలా కష్టపడి పనిచేశారని, రిజల్ట్ కనిపిస్తోందని మెచ్చుకున్నారు. అయితే పనులు పూర్తిగా పూర్తయ్యాకే క్రెడిట్ తీసుకుందామని అధికారులతో చెప్పినట్లు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత టెక్నికల్ కమిటీ వచ్చి అప్రూవల్ ఇస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.*
– *ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ “చాలా సంతోషకరమైన శుభ సమయం ఇది అన్నారు. 1958లో తొలిసారి క్రస్ట్ గేట్లు ఆపరేట్ చేసి నీళ్లు వదిలిన సమయం నుంచి తన శక్తికి మించి సామర్థ్యానికి మించి సేవలందించిన గేట్లు ఈరోజు తుప్పు పట్టిపోయి శిథిల దశకు చేరుకున్న సందర్భంలో వాటి స్థానంలో కొత్త గేట్లు అమర్చడం అనేది చాలా పెద్ద కసరత్తు అని అన్నారు. ఒక రిజర్వాయర్ నిర్మించి గేట్లు అమర్చడం ఒక ఎత్తు అయితే పాత రిజర్వాయర్ కున్న పాత గేట్లను అప్పటి ఉన్న సాంకేతిక విజ్ఞానాన్ని అనుసరించి వాళ్ళు అవలంబించిన పద్ధతులను ఆకళింపు చేసుకుంటూ దానికి ఆధునికత అద్ది మళ్ళీ ఇప్పుడు గేట్లు అమర్చడం అనేది కష్టసాధ్యమైన పని అని పేర్కొన్నారు. ఆ పనిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చొరవతో ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్విఘ్నంగా చేయబోతా ఉన్నామనే విషయమే మా అందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించే అంశం అన్నారు. రైతులతో దశాబ్దాల కాలంగా మాకున్న అనుబంధం, వాళ్లు మా రాజకీయ ప్రతి అడుగులోనూ అందించిన సహకారం మా జీవిత కాలంలో ఎప్పుడూ మర్చిపోలేం అని, అందుకే వాళ్లకు ఎప్పుడు కష్టం వచ్చినా ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి వాళ్ళ కష్టాల్లో భాగం పంచుకోవడం అలవాటుగా చేసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ 33 గేట్ల మార్పిడి అనే ప్రక్రియ నిర్విఘ్నంగా సాగడానికి ఒకవైపు నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు, నిధులు సమకూర్చిన ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ గారు, ఈ అంశాన్ని ముందుకు నడిపించిన జలవనరుల శాఖా మంత్రి రామానాయుడు గారు వీళ్ళందరూ కూడా జిల్లాకు, రాయలసీమకు, కర్ణాటక రాష్ట్రంలో అత్యంత కరువు పీడిత దక్కన్ కర్ణాటకకు చాలా మేలు చేసిన వాళ్లవుతారని, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామన్నారు. ఈరోజు ప్రతిదాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఒక విపక్షం విషపు పక్షం రాజకీయం చేస్తా ఉందన్నారు. మహాత్మా గాంధీ గారు ఆ తర్వాత ఆ ఫలాలను, ఫలితాలను ఈరోజు మనందరికీ అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని, అనేకమంది ముఖ్యమంత్రులయ్యారు, అనేక ప్రభుత్వాలు మారినాయి కానీ రాయలసీమ పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకత్వం తమ సొంతం అన్నారు. 2014-19 మధ్యకాలంలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల పైనే 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు గారిదని, ఇదొక చరిత్ర అని, ఈ 20 నెలల కాలంలో 8 వేల కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టామని, ఎప్పుడూ జరగలేదన్నారు. రాయలసీమకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చే గొప్ప నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో రాయలసీమ సంపదకు కేంద్రంగా మారబోతా ఉందని, త్వరలోనే అమలయ్యే హార్టికల్చర్ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతా ఉందని, దీనికి సహకరిస్తున్న మరి అందరికీ కూడా పేరుపేరునా చేతులెత్తి వాళ్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నానని తెలిపారు.*
*దరోజి టన్నెల్‌ను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ :*
– *కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ ను పరిశీలించిన అనంతరం, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తుంగభద్ర డ్యామ్ నుండి రాయలసీమకు నీరందించే ప్రధానమైన తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవెల్ కెనాల్‌లో km 37.700 నుండి km 38.502 వరకు ఉన్న 802 మీటర్ల పొడవైన దరోజి టన్నెల్‌ను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి ట్రాక్టర్‌పై దరోజి టన్నెల్ లోపలికి వెళ్లి టన్నెల్ లోపలి భాగాన్ని పరిశీలించారు.*
