Latest Posts

పాలిటెక్నిక్‌లో ఘనంగా జాబ్ అచీవర్స్ డే – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత…

అనంతపురం జిల్లా.

*పాలిటెక్నిక్‌లో ఘనంగా జాబ్ అచీవర్స్ డే – విద్యార్థులకు నియామక పత్రాల అందజేత*

అనంతపురం, మార్చి 31 :

– అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 31-03-2026 తేదిన జాబ్ అచీవర్స్ డే (JAD) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ సి.జయచంద్రరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా DRDO శాస్త్రవేత్త డా.ఎన్.కిషోర్ నాథ్, హ్వాసంగ్ ఐఏ ఆటోమోటివ్స్ సీనియర్ హెచ్‌ఆర్ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు.

– ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సి.జయచంద్రరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆటోమొబైల్, సివిల్, ఈఈఈ, ఈసిఈ, మెకానికల్ విభాగాలకు చెందిన మొత్తం 513 మంది విద్యార్థులు 29 ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందినట్లు తెలిపారు. Blue Star, UltraTech Cements, Sobha Developers, Kalpataru International Projects Ltd., Wipro Aerospace, Starworth Infrastructure Ltd., Rakon Aerospace, Motherson, Hwaseung, Tata Electronics, Aaviza Electronics మొదలగు వంటి సంస్థల్లో వందశాతం ప్లేస్‌మెంట్లు నమోదయ్యాయని వెల్లడించారు. అత్యదిక వార్షిక వేతనం 4.06 ముగ్గురు మెకానికల్ విద్యార్తులు Blue Star కంపెని లో ప్లేసెమెంట్ ద్వారా పొందారు అని తెలిపారు.

– ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు విజ్ఞాన దృక్పథంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కృషి, దీక్ష, పట్టుదల ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. తాను కూడా ఒకప్పుడు పాలిటెక్నిక్ విద్యార్థినేనని, డిప్లొమా అనంతరం స్వల్ప వేతనంతో ఉద్యోగం ప్రారంభించి, నేడు అనేకమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగానని వివరించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం సృష్టిస్తోందని పేర్కొన్నారు. “ఉద్యోగాలు సాధించడం మాత్రమే కాదు, భవిష్యత్తులో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి” అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. 2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

– DRDO శాస్త్రవేత్త డా.ఎన్.కిషోర్ నాథ్ మాట్లాడుతూ, తాను ఈ కళాశాల పూర్వ విద్యార్థినని గుర్తుచేసుకుంటూ, ప్రస్తుతం కళాశాలలో ఉన్న సదుపాయాలు, అభివృద్ధిని అభినందించారు. పాలిటెక్నిక్ విద్య ద్వారా సాధించిన తన ప్రయాణాన్ని విద్యార్థులతో పంచుకున్నారు.

– హ్వాసంగ్ సంస్థ సీనియర్ హెచ్‌ఆర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, తమ సంస్థలో ఇంతవరకు కొద్దిమంది విద్యార్థులను మాత్రమే అప్రెంటీస్‌గా తీసుకున్నామని, ఇకపై మరింత మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

– తదనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులను ప్రిన్సిపాల్, విభాగాధిపతులు, అధ్యాపకులు సత్కరించారు. ఈ కార్యక్రమం కళాశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించే “ఉద్యోగాల పండుగ”గా నిలిచింది.

Posted Under AP
Editor