విజయవాడ, మంగళగిరి.
*మంగళగిరిలోని టిడిపి పార్టీ కార్యాలయం నందు ప్రజల నుంచి వినుతుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురము జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు*
*టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో కలసి పాల్గొన్న పూల నాగరాజు గారు*
మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా స్పందన కార్యక్రమంలో అనంతపురము జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు గారు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారితో కలిసి పూల నాగరాజు గారు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, ఆయా అర్జీలను పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు అక్కడికక్కడే ఫోన్‌లోనే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వానికి మొదటి అజెండా అన్నారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని పూల నాగరాజు గారు పేర్కొన్నారు.
