- అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో బడుగు బలహీన వర్గాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నట్లు అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
నిరుపేద కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఇతోదికంగా సహాయం చేస్తున్నట్లు చెప్పారు. రాయదుర్గం పట్టణంలోని ఎమ్మెల్యే స్వగృహంలో సోమవారం
34 మంది బాధిత కుటుంబాలకు రూ. 11 లక్షల పైచిలుకు చెక్కులను ఎమ్మెల్యే కాలవ పంపిణీ చేశారు. అలాగే ఇప్పటివరకు రాయదుర్గం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 20 నెలలకు 269 మంది బాధితులకు రూ. 2.23 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
