గ్రామ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం
మండల గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమడ సిఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని కుటాలపల్లి లో పోలీసులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ గౌడ్ తన సిబ్బందితో కలిసి గ్రామస్తులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళల, చిన్నపిల్లలపై నేరాలు ఫోక్సొ చట్టాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామాలలో ఎవరైనా గొడవలకు పాల్పడిన, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నా పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. యువత గొడవలలో తలదూర్చి అందమైన భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తెలిపారు. గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుంటే తమకు తెలపాలని వారి పేరు గోపంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సతీష్ కుమార్ నల్లమడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
గ్రామ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు…
