రాహుల్ ను విమర్శిస్తే తోలు తీస్తామని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేటీఆర్ కు మరింత అహం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని విమర్శించడం సరికాదన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకం అంతా పచ్చగా ఉన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉన్నదని, బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్నారన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు దోచుకున్నట్లు అంతా అలానే ఉంటారని వాళ్లు భావిస్తున్నారన్నారు.
కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదు
కాంగ్రెస్ పార్టీ సంస్థాగత అంశాలపై రాహుల్ తెలంగాణకు వచ్చారన్నారు. ఇవేమీ తెలియకుండా కేటీఆర్ విమర్శలు చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరహాలో తమ పార్టీ కేవలం ఐదుగురు వ్యక్తులతో నడవదని ఎంపీ చురకలు అంటించారు. కాంగ్రెస్ అందరూ నాయకులేనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీకి ఎన్నడైన ట్రైనింగ్ ప్రోగ్సామ్స్ జరిగాయా? అంటూ ప్రశ్నించారు. సెక్రటేరియట్ ను కూలగొట్టి ఏ మంత్రి ఎక్కడ కూర్చున్నాడో? తెలియకుండా పాలన జరిగిందన్నారు. బీజేపీ, బీఆర్ ఎస్ ల తీరును ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు.
