Latest Posts

సీజేఐగా తొలిరోజునే 17 కేసుల విచారణ: అత్యవసర కేసులకు కొత్త నియమం అమలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ హోదాలో తొలిరోజునే ఆయన 17 కేసులను విచారించారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి భవన్ నుంచి సుప్రీంకోర్టుకు చేరుకున్న జస్టిస్ సూర్యకాంత్, న్యాయస్థానం ప్రాంగణంలోని గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించారు.

జస్టిస్ సూర్యకాంత్ ఈ సందర్భంగా ఒక కొత్త విధానపరమైన నియమాన్ని తీసుకువచ్చారు. ఇకపై అత్యవసరంగా విచారణకు స్వీకరించాల్సిన కేసుల (అర్జెంట్ లిస్టింగ్ కేసులు)ను తప్పనిసరిగా లిఖితపూర్వకంగా సమర్పించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త నియమం ద్వారా కేసుల జాబితాలో క్రమశిక్షణ, స్పష్టత పెరుగుతాయని భావిస్తున్నారు.

అయితే, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. మరణశిక్ష మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం కలిగే అత్యంత ముఖ్యమైన కేసుల విషయంలో మాత్రమే మౌఖిక అభ్యర్థనలను అనుమతిస్తామని ఆయన తెలిపారు. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రెండు గంటల వ్యవధిలో 17 కేసులను విచారించింది.

Editor